Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ్యారీడ్ హీరోయిన్ రెబ‌లిజం

కొన్ని నెల‌లుగా క‌త్రిన ఫ్రెగ్నెన్సీ గురించి పుకార్లు వినిపిస్తున్నా దానిని అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   18 July 2025 9:32 AM IST
ఫోటో స్టోరి: మ్యారీడ్ హీరోయిన్ రెబ‌లిజం
X

త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో దాదాపు రెండు ద‌శాబ్ధాల పాటు ప‌రిశ్ర‌మ‌ను ఏలింది క‌త్రిన కైఫ్‌.2003లో బూమ్ అనే చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత వెంకీ స‌ర‌స‌న `మ‌ల్లీశ్వ‌రి` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. బాలీవుడ్, టాలీవుడ్ లో టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించిన క‌త్రిన ఇటీవ‌ల పూర్తిగా ప్ర‌యివేట్ లైఫ్ కి ప్రాధాన్య‌తనిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశ‌ల్ ని పెళ్లాడిన క‌త్రిన ఆ త‌ర్వాత సినిమాల ప‌రంగా వేగం త‌గ్గించింది. స‌ల్మాన్ తో టైగ‌ర్ ఫ్రాంఛైజీలో న‌టిస్తోంది. 2023లో టైగ‌ర్ 3, 2024 లో మెర్రి క్రిస్మ‌స్ చిత్రాల్లో న‌టించిన క‌త్రిన‌, 2025లో ఇంకా ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌లేదు.

కొన్ని నెల‌లుగా క‌త్రిన ఫ్రెగ్నెన్సీ గురించి పుకార్లు వినిపిస్తున్నా దానిని అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు. మ‌రోవైపు క‌త్రిన ఫోటోషూట్ల ప‌రంగాను ఇత‌రుల‌తో పోలిస్తే వెన‌క‌బ‌డి ఉంది. సోష‌ల్ మీడియాల్లో రేర్ గా మాత్ర‌మే స్పెష‌ల్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. నిన్న‌నే బ‌ర్త్ డే జ‌రుపుకున్న ఈ బ్యూటీకి ప్రియాంక చోప్రా, క‌రీనా స‌హా ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రులు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అభిమానులు క‌త్రిన త‌దుప‌రి సినిమా ప్ర‌క‌ట‌న గురించి ఆస‌క్తిగా వేచి చూస్తున్నా దానికి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


తాజాగా క‌త్రిన త్రోబ్యాక్ ఫోటోషూట్ ని షేర్ చేసిన `ఎల్లే ఇండియా` మ్యాగ‌జైన్ దీనికి ఆస‌క్తిక‌ర‌ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఎల్లే వివ‌రాల ప్ర‌కారం.. ఇది 2019లో తీసిన ఫోటోషూట్. ఆ సమయంలో ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండే క‌త్రిన‌ మా కవర్‌ను అందమైన‌ శైలిలో అలంకరించింది. క‌త్రిన‌ రెడ్ కార్పెట్ న‌డ‌క‌లు, వెండితెర వెలుగులు ప్ర‌తిదీ గేమ్ ఛేంజ‌రే. క్లీన్ లైన్స్, బోల్డ్ సిల్హౌట్‌లు ఎక్కువ ప్రయత్నించకుండానే అందరి దృష్టిని ఆకర్షించే నిశ్శబ్ద విశ్వాసం క‌త్రిన‌. బాలీవుడ్ ప‌వ‌ర్ హౌస్ గా ఏల్తున్న క‌త్రిన నిజ‌మైన క్వీన్ అని ఎల్లే ప్ర‌శంసించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. క‌త్రిన ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో అందంగా ఫోజులిచ్చింది. ఇందులో బికినీ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మ్యారీడ్ హీరోయిన్ రెబ‌లిజం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే విక్కీని క‌త్రిన 2021లో పెళ్లాడింది. అంత‌కంటే ముందే ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది.