దిశా ట్రెడిషనల్ అండ్ బోల్డ్
దిశా టోన్డ్ బాడీ కి సరిపోయే అందమైన డిజైనర్ లుక్కు ఇది. సీకే బ్యూటీగా దిశా అందాలను ఆరబోసింది.
By: Tupaki Desk | 17 April 2025 8:56 AM ISTఒకే లుక్కులో రెండు వెర్షన్లు చూపించడం ఎలానో ఇదిగో ఇక్కడ దిశా పటానీని అడగాలి. ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే, మరోవైపు టూమచ్ గ్లామ్ ని ఎలివేట్ చేసింది ఈ బ్యూటీ. తళతళా మెరుస్తున్న ఈ డిజైనర్ చీరలో దిశా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆరెంజ్ అండ్ గోల్డ్ మిరుమిట్ల కాంతులతో చీరందం మతులు చెడగొడుతోంది.
దిశా టోన్డ్ బాడీ కి సరిపోయే అందమైన డిజైనర్ లుక్కు ఇది. సీకే బ్యూటీగా దిశా అందాలను ఆరబోసింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ట్రెడిషనల్ అవతార్ లోను గుబులు రేపుతోంది. ఇలాంటి విలక్షణత, అందం మత్తు తనకు మాత్రమే సొంతం అని నిరూపిస్తోంది.
దిశా సినీ కెరీర్ కంటే ఇటీవల డేటింగ్ జీవితం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ భామ టైగర్ ష్రాఫ్ నుంచి బ్రేకప్ అయ్యాక ఫిట్నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో డేటింగ్ చేస్తోందని కథనాలొచ్చాయి. ఇటీవల స్టైలిస్ట్ మోహిత్ రాయ్ పుట్టినరోజు వేడుకలో కూడా ఈ జంట కలిసి కనిపించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దిశా పటాని చివరిసారిగా కంగువాలో కనిపించింది. ఈ సినిమాతోనే తమిళంలో ఆరంగేట్రం చేసింది. కానీ తొలి ప్రయత్నం డిజాస్టరైంది. తదుపరి బాలీవుడ్లో వరుస చిత్రాలతో ఈ బ్యూటీ బిజీ కానుంది.
