రోజుకు 40 రోటీలు..లిటరున్నర పాలు తాగిన నటుడు!
బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్ గురించి పరిచయం అవసరం లేదు. వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 25 April 2025 12:02 PM ISTబాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్ గురించి పరిచయం అవసరం లేదు. వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమాలు సహా వెబ్ సిరీస్ ల్లోనూ నటించాడు. గత ఏడాది `మహారాజ్` సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా జైదీప్ తన డైట్ ప్లాన్ గురించి రివీల్ చేసాడు. 28 ఏళ్ల వయసు వచ్చే వరకూ రోజు 40 రోటీలు.. లీటరున్నర పాలు తాగేవారుట.
అయినా ఏనాడు 70 కేజీలు బరువు మించిపోలేదన్నారు. అయితే ఒక వయసు దాటిన తర్వాత తిండిలో తప్పక మార్పులు చేసుకోవాలని సూచించారు. షూటింగ్ ఎక్కడ జరిగినా ఇంటి ఆహారం మాత్రమే తీసుకుంటాడుట. ఒక వేళ ఇంటి ఆహారం అందుబాటులో లేకపోతే ఆ పూట ఖాళీ కడుపుతో ఉంటా నన్నారు. అయితే షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం అక్కడ దొరికే వాటితో సర్దుకుం టానన్నారు.
ఇండియాలో ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లినా ఇలాంటి పరిస్థితి తప్పదన్నారు. 28 ఏళ్ల వరకూ బలమైన పుడ్ తీసుకోవడంతో ఈ వయసులో బాగా కలిసొస్తుందన్నారు. పిట్ నెస్ విషయంలో సెలబ్రిటీల కేరింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉదయం జిమ్...యోగా క్రమం తప్పకుండా చేస్తారు. మితమైన ఆహారం తీసు కుంటా రు. లుక్ లో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చినప్పుడు డైడ్ ప్లాన్ మరింత కఠినంగా ఉంటుంది.
అలాగే భక్తి నేపథ్యం గల సినిమాలు చేస్తున్న సమయంలో చాలా మంది సెలబ్రిటీలు నాన్ వెజ్ జోలికి వెళ్లడం లేదు. సెట్స్ లో ఎలాంటి కండీషన్లు లేకపోయినా భక్తి భావంతో కఠిన నియమాలు ఆచరించి షూటింగ్ పూర్తి చేయడం అన్నది పరిపాటిగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో `రామాయణం` టీమ్ ఇదే రూల్ అనుసరిస్తోంది.
