Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బాబి హాట్ బ్యూటీనే రిపీట్ !

ఆమె క్రేజ్ ని..ట్యాలెంట్ ని గుర్తించి ద‌ర్శ‌కుడు బాబి క‌ల్పించిన ఛాన్స్ అది. అయితే ఈ కాంబినేష‌న్ ఇక్క‌డితో ఆగేలా లేదు. తాజాగా బాల‌య్య సినిమా కోసం బాబి ఆమెనే మ‌ళ్లీ రిపీట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 5:30 AM GMT
మ‌ళ్లీ బాబి హాట్ బ్యూటీనే రిపీట్ !
X

హాట్ సెరైన్ ఊర్వ‌శి రౌతేలా టాలీవుడ్ మెరుపులు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇప్ప‌టికే కుర్రకారు లో జోష్ నింపేసింది. వాల్తేరు వీర‌య్య‌..ఏజెంట్..బ్రో...స్కంద లాంటి చిత్రాల్లో హాట్ ఐటం పాట్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. హీరోయిన్లు అంతా ఐటం భామ‌ల‌గా ట‌ర్న్ అవుతోన్న స‌మ‌యంలోనే ఊర్వశి త‌న మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది.


ఆ ర‌కంగా మేకర్స్ ఆలోచ‌న‌ల్లో మ‌ళ్లీ మార్పు తీసుకొచ్చిన భామ‌గా నిలిచింది. ముఖ్యంగా 'వాల్తేరు వీర‌య్య'లో బాస్ పార్టీ సాంగ్ తో ఏ రేంజ్లో సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఆ పాట స‌క్సెస్ తో అమ్మ‌డు మార్కెట్ లో ఓ బ్రాండ్ అయిపోయింది. ఆమె క్రేజ్ ని..ట్యాలెంట్ ని గుర్తించి ద‌ర్శ‌కుడు బాబి క‌ల్పించిన ఛాన్స్ అది. అయితే ఈ కాంబినేష‌న్ ఇక్క‌డితో ఆగేలా లేదు. తాజాగా బాల‌య్య సినిమా కోసం బాబి ఆమెనే మ‌ళ్లీ రిపీట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డితో పోలీస్ గెట‌ప్ వేయించ‌డంతో పాటు ఐటం సాంగ్ కోసం రంగంలోకి దించుతున్న‌ట్లు స‌మాచారం. ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్న చందంగా ఒకే పారితోషికంతో రెండు ర‌కాల అడ్వాటేంజ్ లు క‌లిగేలా బాబి ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

అలాగే ఊర్వ‌శి రౌతేలా తెలుగులో బ్లాక్ రోజ్ అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈసినిమా చాలా కాలంగా పెండింగ్ లో ప‌డింది. సినిమా అప్ డేట్స్ ఎవీ బ‌య‌ట‌కు రాలేదు. అలాగే అమ్మ‌డు హిందీ లో కొన్ని సినిమాలు చేస్తుంది. అయితే ఊర్వ‌శి ఎక్కువ‌గా తెలుగు చిత్రాల‌పైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తుంది.