Begin typing your search above and press return to search.

ఎక్కడికెళ్లినా ప్రభాస్ సినిమాను వదలట్లే..

బాబీ సింహా ఈ మధ్య పలు యుట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వాటిలో సలార్ పార్ట్ 2 గురించి ఎక్కువగా చెబుతున్నాడు.

By:  Tupaki Desk   |   16 March 2024 4:59 AM GMT
ఎక్కడికెళ్లినా ప్రభాస్ సినిమాను వదలట్లే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 730 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. షారుఖ్ ఖాన్ డంకీ మూవీ పోటీ లేకుండా ఉంటే వెయ్యి కోట్లు క్రాస్ చేసేది. సలార్ రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ సలార్ 2 శౌర్యంగ పర్వం మీద పడింది. మొదటి పార్ట్ లో చాలా ప్రశ్నలు లేవనెత్తి వాటికి శౌర్యంగ పర్వంలో సమాధానాలు దొరుకుతాయని ప్రశాంత్ నీల్ క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చారు.

సలార్ లో బాబీ సింహాని విలన్ గా ఎస్టాబ్లిష్ చేసిన మూవీ ఎండింగ్ లో అతను కూడా శౌర్యంగ వంశానికి చెందిన వాడని రిప్రజెంట్ చేశారు. ప్రభాస్ తో సమానమైన ఎలివేషన్ బాబీ సింహాకి కూడా ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. దీంతో పార్ట్ లో అతని క్యారెక్టర్ కి చాలా ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం అయ్యింది. మొదటి పార్ట్ లో దొరకని పెర్ఫార్మెన్స్ స్కోప్ శౌర్యంగ పర్వంలో లభిస్తోందని తెలుస్తోంది.

బాబీ సింహా ఈ మధ్య పలు యుట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వాటిలో సలార్ పార్ట్ 2 గురించి ఎక్కువగా చెబుతున్నాడు. ఏప్రిల్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని బాబీ సింహా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే సలార్ 1 కంటే సలార్ 2 మూవీ గ్రాండియర్ గా ఉండబోతోందని అన్నారు. సలార్ పార్ట్ 1 క్లైమాక్స్ లో వచ్చిన గూస్ బాంబ్స్ ఎపిసోడ్ కంటే 100 టైమ్స్ బెస్ట్ సీక్వెన్స్ శౌర్యంగపర్వంలో ఉంటాయని చెప్పారు.

సెకండ్ పార్ట్ మొత్తం ఖాన్సార్ చుట్టూనే తిరుగుతుంది. అక్కడ ప్రభాస్ విధ్వంసం, రూలింగ్ మొత్తం అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో అద్భుతంగా ఉంటుందని బాబీ సింహా చెప్పుకొచ్చాడు. ఇతను ఇస్తోన్న ఎలివేషన్స్ కారణంగా సలార్ 2 మీద ఫ్యాన్స్ కి హైప్ ఎక్కువ అయిపోతుంది. సలార్ 1 కి మించిన ఎక్స్ పెక్టేషన్స్ శౌర్యంగపర్వం మీద ఉండబోతున్నాయి.

వచ్చే ఏడాది ఆగష్టు లోపు ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొని వస్తామని చిత్ర నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. సలార్ 2 కంప్లీట్ చేయడం మీద ప్రశాంత్ నీల్ ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ప్రభాస్ కూడా కల్కి ఫినిష్ చేసిన వెంటనే సలార్ 2 షూటింగ్ పైన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.