Begin typing your search above and press return to search.

స్పై వ‌ర‌ల్డ్ లోకి డేంజ‌రస్ విల‌న్!

`యానిమ‌ల్` హిట్ తో బాలీవుడ్ న‌టుడు బాబీడియోల్ పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నంగా మారిపోయాడు.

By:  Tupaki Desk   |   30 March 2024 6:27 AM GMT
స్పై వ‌ర‌ల్డ్ లోకి డేంజ‌రస్ విల‌న్!
X

`యానిమ‌ల్` హిట్ తో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నంగా మారిపోయాడు. అప్ప‌టివ‌ర‌కూ ఎన్నో హిందీ సినిమాల్లో ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషించినా? `యానిమ‌ల్` లో అబ్రార్ రోల్ మాత్రం అత‌డి కెరీర్ ని కొత్త ట‌ర్నింగ్ పాయింట్ లా మారిపోయింది. సౌత్ లో ఎంతో ఫేమ‌స్ న‌టుడిగా వెలిగిపోతున్నాడిప్పుడు. ప్ర‌స్తుతం సూర్య హీరోగా న‌టిస్తోన్న కోలీవుడ్ చిత్రం `కంగువా`లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ చిత్రంలో బాబి రోల్ ఎంతో వైవిథ్యంగా..అంతే ధీటుగా ఉంటుంద‌ని స‌మాచారం.

అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న పీరియాడిక్ చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` కూడా విల‌న్ పాత్ర పోషిస్తు న్నాడు. మ‌రోవైపు న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టిస్తోన్న 109వ చిత్రంలో కూడా బాబి డియోల్ నే విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఇలా ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో బాబి డియోల్ ఫేమ‌స్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఈ సినిమాలు విజ‌యం సాధిస్తే ఇక్క‌డ‌త‌ని మేనియా కొన్నాళ్ల పాటు కొన‌సాగుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. విల‌న్ ఎవ‌రంటే? మ‌న డైరెక్ట‌ర్లంద‌రికీ బాబినే గుర్తొస్తాడు.

అలాగే బాలీవుడ్ లో బాబి డియోల్ కెరీర్ స్పీడ్ అందుకుంది. తాజాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న స్పై వ‌ర‌ల్డ్ లో కి బాబి డియోల్ ఎంట‌ర్ అయ్యాడు. అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతుంది. ఇందులో శ‌ర్వ‌రీ వాఘ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాబి డియోల్ ని మెయిన్ విల‌న్ గా ఎంపిక చేసారు. అలియా..శ‌ర్వీర‌ల‌ను ఓడించ‌డానికి గుఢ‌చారి ప్ర‌పంచంలోకి మొద‌టిసారి అడుగు పెట్ట‌బోతున్నాడు.

ఇందులో అత‌డి పాత్ర వైవిథ్యంగా ఉంటుంద‌ని..గెట‌ప్ పూర్తిగా కొత్త‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఆ పాత్ర‌కి సంబంధించి విదేశాల్లో ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ ఇవ్వ‌బోతున్నారుట‌. ఈ ఏడాది మిడ్ నుంచి సినిమా ప్రారంభం కానుంది. షూటింగ్ కోసం తానెంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్న‌ట్లు బాబి డియోల్ తెలిపాడు. ప్ర‌స్తుతానికైతే సౌత్ సినిమాల‌తోనే బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంత కాలంగా హైద‌రాబాద్ టూ చెన్నై ఎక్కువ‌గా తిరిగుతున్నారు.