Begin typing your search above and press return to search.

అన్నయ్య‌ హ‌నుమంతుడు.. త‌మ్ముడు కుంభ క‌ర్ణుడు

నితేష్ తివారీ 'రామాయణం' మొద‌టి భాగం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:30 AM GMT
అన్నయ్య‌ హ‌నుమంతుడు.. త‌మ్ముడు కుంభ క‌ర్ణుడు
X

నితేష్ తివారీ 'రామాయణం' మొద‌టి భాగం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు స‌హా కాస్టింగ్ ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విస్త్ర‌తంగా చ‌ర్చ‌ల్లోకి వ‌స్తున్న ఈ సినిమాలో మ‌ధు మంతెన‌- అల్లు అర‌వింద్ పెట్టుబ‌డిదారులుగా ఉంటార‌ని క‌థ‌నాలొచ్చాయి. రామాయ‌ణ గాధ ఆధారంగా రూపొంద‌నున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీ‌రాముడిగా నటించనున్నట్లు సమాచారం. రావణుడి పాత్రలో కెజిఎఫ్ స్టార్ యష్ నటిస్తార‌ని, సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

సన్నీ డియోల్ లార్డ్ హనుమంతుడిగా నటించే వీలుంది. సన్నీ డియోల్ రామాయణం కోసం 45 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకోనున్నాడ‌ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు బాబీ డియోల్ గురించి మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కుంభక‌ర్ణుడిగా నటించేందుకు బాబీ డియోల్‌ను సంప్రదించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనికి విరుద్ధంగా బాబీ డియోల్ బృందం తాజా ఊహాగానాలను నిర్ద్వంద్వంగా ఖండించింది. బాబీని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

బాబీ డియోల్ విజయగాథ

యానిమల్ అద్భుతమైన విజయంతో బాబీ డియోల్ పై ద‌ర్శ‌కుల క‌న్ను ప‌డింది. అత‌డు తిరిగి మళ్లీ స్పీడందుకున్నాడు. యానిమ‌ల్ గొప్ప విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. ఈ చిత్రంలో అబ్రార్ పాత్ర‌లోకి అత‌డి రూపాంతరం, న‌ట‌న‌ అందరికీ నచ్చింది. జమాల్ కుద్దు పాట‌కు బాబీ చేసిన డ్యాన్స్ కూడా వైరల్‌గా మారింది. యానిమల్ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది.

నితీష్ తివారీ రామాయ‌ణం చిత్రాన్ని మూడు భాగాలుగా తెర‌కెక్కించ‌నున్నారు. తాజా క‌థ‌నం ప్రకారం VFX కోసం ఆస్కార్ విన్నింగ్ కంపెనీ DNEG ప‌ని చేస్తోంది. చిత్రీకరణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. న‌టీన‌టుల వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.