Begin typing your search above and press return to search.

రానానాయుడిని స‌రిగా తీయ‌లేదు: బాబి డియోల్

ఆ షో చూసినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇది మనోహరమైన పాత్రలతో కూడిన అందమైన కథ అని భావించినట్టు తెలిపాడు. కానీ మేకర్స్ హిందీ రీమేక్‌ని చేయవలసిన విధంగా చేయలేదు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 2:30 AM GMT
రానానాయుడిని స‌రిగా తీయ‌లేదు: బాబి డియోల్
X

ప్రకాష్ ఝా వెబ్ సిరీస్ 'ఆశ్రమ్‌'లో అద్భుత న‌ట‌న‌తో మెప్పించాడు బాబి డియోల్. తన పాత్ర పేరే ఇంటి పేరుగా మారింది. అత‌డు త‌న‌కు అంద‌కుండా పోయిన ఒక ఆఫ‌ర్ గురించి బహిరంగంగా ఓపెన‌య్యాడు. ప్ర‌ముఖ తెలుగు హీరోలు న‌టించిన ఈ సిరీస్ లో త‌న‌కు న‌టించాల‌ని ఉన్నా అవ‌కాశం రాలేద‌ని దానికి చాలా బాధప‌డ్డాన‌ని తెలిపాడు. పాపుల‌ర్ హాలీవుడ్ సిరీస్ 'రే డోనోవన్' భారతీయ రీమేక్ అయిన 'రానా నాయుడు'లో భాగం కాలేకపోవడంపై ఇటీవల ఓపెన‌య్యాడు. ఈ సిరీస్‌లో న‌టించాల‌నుకున్నా కానీ త‌న‌కు అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని అన్నాడు. ఇందులో రానా దగ్గుబాటి- వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. కానీ త‌న‌ను వెబ్ సిరీస్ కోసం తీసుకోనందున క‌ల‌త చెందాన‌ని బాబీ డియోల్ వెల్లడించాడు. మీరు ఏ వెబ్ సిరీస్‌ని అంతగా ఎంజాయ్ చేయలేదని అడిగినప్పుడు, రానా నాయుడు అంటే నాకు ఇష్టం లేదని బాబీ పాపుల‌ర్ మీడియా ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

తాను నటుడిగా ఎంతో అభిమానించిన 'రే డోనోవన్‌'ని రీమేక్ చేయాలనుకున్నానని, అయితే ఆ సిరీస్ భార‌తీయ రీమేక్‌కి తనను తీసుకోలేదని కూడా వెల్లడించాడు. ఆ షో చూసినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇది మనోహరమైన పాత్రలతో కూడిన అందమైన కథ అని భావించినట్టు తెలిపాడు. కానీ మేకర్స్ హిందీ రీమేక్‌ని చేయవలసిన విధంగా చేయలేదు.

అదే ఇంటర్వ్యూలో బాబీని ఏ న‌టుడితో అయితే మీరు క‌లిసి న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రో చెబుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు అలాంటి ఆలోచ‌న‌లు ఉండ‌వ‌ని అన్నాడు. నేనెప్పుడూ అలా అనుకోను.. అది నా స్వ‌భావం కాదు.. నీ ఎంపిక నాది కాదు.. నీతో కలిసి పనిచేయడం నాకు ఇష్ట‌మే.. అని బాబీ అన్నారు. తన తండ్రి గారు అయిన‌ ప్రముఖ నటుడు ధర్మేంద్ర తన సహనటుడిని కలుసుకున్నప్పుడు ''నేను మీతో ఎప్పటికీ పని చేయను'' అని అత‌డు చెప్పాడ‌ట‌. దానికి స‌మాధానంగా మా నాన్న 'నీకు ఏది ఇష్టమో అది చేయ్' అని చెప్పార‌ని బాబి తెలిపాడు. ఆపై కాలం మారిపోయింది. అదే నటుడితో సినిమా వచ్చింది. అత‌డు మా నాన్నతో అన్న మాట‌లు అత‌డికి తెలుసు కాబట్టి ఇప్పుడు కలిసి పనిచేయడని ఆందోళన చెందాడు! అని కూడా గుర్తు చేసుకున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బాబీ ఇటీవ‌ల వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యారు. తదుపరి సందీప్ రెడ్డి వంగా హిందీ డైరెక్షన్ మూవీ 'యానిమల్‌'లో కనిపించనున్నారు. ఇందులో అత‌డు విల‌న్ గా క‌నిపిస్తాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాష‌ల్లో థియేటర్లలో విడుదల కానుంది. ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టించేందుకు బాబి సంత‌కాలు చేసాడు.