Begin typing your search above and press return to search.

బాబీ డియోల్.. మరోసారి భయపెట్టేలా ఉన్నాడు!

ఈరోజు బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ తోనే భయపెట్టేసాడు బాబీ డియోల్.

By:  Tupaki Desk   |   27 Jan 2024 6:19 AM GMT
బాబీ డియోల్.. మరోసారి భయపెట్టేలా ఉన్నాడు!
X

'యానిమల్' సినిమాతో విలన్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్. గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సినిమాలో బాబీ డియోల్ తన స్టైలిష్ లుక్స్ తో పాటు మోస్ట్ వైలెంట్ విలన్ గా అదరగొట్టేసాడు. యానిమల్ సక్సెస్ తో బాబి డియోల్ కి సౌత్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువా' సినిమాలో మరోసారి విలన్ రోల్ చేస్తున్నారు.




ఈరోజు బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ తోనే భయపెట్టేసాడు బాబీ డియోల్. సినిమాలో అతను ఎంత క్రూరంగా ఉంటాడనేది జస్ట్ లుక్ ద్వారానే చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో బాబి డియోల్ 'ఉదిరన్' పాత్రలో కనిపించబోతున్నాడు. పోస్టర్ లో అతని గెటప్ మరింత భయంకరంగా ఉంది. గుబురు గడ్డం, పొడవాటి జుట్టు దానిపై జింక కొమ్ములు తగిలించుకొని ఆడవాళ్ళ మధ్య ఉన్న బాబీ డియోల్ లుక్ సినిమా పైనే అంచనాలను పెంచేసింది.

ఇక ఈ లుక్ లో బాబీ డియోల్ ఎడమ కన్ను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఆ రేంజ్ లో బాబీ డియోల్ మెకోవర్ ఉంది. సినిమాలో బాబీ డియోల్ ఓ తెగకి నాయకుడిగా కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాలో సూర్య మెకోవరే డిఫరెంట్ గా ఉందని అనుకుంటే అంతకుమించి బాబి డియోల్ లుక్ ని డిజైన్ చేశారు.

మొత్తంగా యానిమల్ లో స్టైలిష్ వైలెంట్ విలన్ గా అదరగొట్టిన బాబి డియోల్ ఈసారి కంగువాలో 'ఉదిరన్' గా తన క్రూరత్వంతో మరింత భయపెట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో బాబీ డియోల్ రోల్ కనుక క్లిక్ అయితే సౌత్ లో ఆయన విలన్ గా బిజీ అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ నుంచి ఇప్పటికే సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ సౌత్ లో ఇలా డిఫరెంట్ రోల్స్ లో నటించి సౌత్ లో విలన్ గా చక్రం తిప్పుతున్నాడు.

ఇక రాబోయే రోజుల్లో బాబి డియోల్ కూడా ఆ స్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కంగువా విషయానికొస్తే.. తమిళ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య ఆరు విభిన్న తరహా పాత్రల్లో కనిపించబోతున్నాడు. సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నారు.