Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' సీక్వెల్ ఇంకా ఎప్ప‌టికి?

సీక్వెల్ గురించి అంత‌గా వెల్లడించకుండానే సందీప్ రెడ్డి వంగా మరో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలుసు..దానికి సమయం పడుతుంది అని హింట్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   11 March 2024 10:30 AM GMT
యానిమ‌ల్ సీక్వెల్ ఇంకా ఎప్ప‌టికి?
X

'యానిమల్' ఘ‌న‌విజయం తర్వాత సీక్వెల్ 'యానిమల్ పార్క్' గురించి అధికారిక ప్రకటన వెలువ‌డింది. సందీప్ రెడ్డి వంగా- ర‌ణ‌బీర్ కాంబినేష‌న్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా అభిమానులు దీనికోసం వేచి చూస్తున్నారు. ఇటీవల హిందీ మీడియా అవార్డ్స్ వేడుక‌లో నెగిటివ్ రోల్‌లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న బాబీ డియోల్ ఈ చిత్రం సీక్వెల్ గురించి ఓపెనయ్యాడు. సీక్వెల్ గురించి అంత‌గా వెల్లడించకుండానే సందీప్ రెడ్డి వంగా మరో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలుసు..దానికి సమయం పడుతుంది అని హింట్ ఇచ్చాడు.

సందీప్ వంగా - భూషణ్ కుమార్ బ్లాక్‌బస్టర్ మూవీ 'యానిమల్‌'కు సీక్వెల్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నార‌ని అత‌డు చెప్ప‌క‌నే చెప్పాడు. T సిరీస్ అధికారిక పేజీలో ఇంత‌కుముందు యానిమ‌ల్ సీక్వెల్ ని అధికారికంగా ఖ‌రారు చేసింది. ''ఇది నమ్మకంపై నిర్మిత‌మైన భాగస్వామ్యం.. సృజనాత్మక స్వేచ్ఛతో ఆజ్యం పోసినది.. విడదీయరాని బంధంతో బలపడింది.

నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు #సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్ , అల్లు అర్జున్ తో సినిమా... #యానిమల్ స్మారక విజయాన్ని అనుసరించే అధ్యాయాలు'' అని తెలిపారు.

యానిమ‌ల్ ఒక మృగం లాంటి కొడుకు క‌థ‌. ఈ చిత్రంలో విజయ్ (రణ్‌బీర్ పోషించిన పాత్ర) తన తండ్రిని (అనిల్ కపూర్ పోషించిన) రక్షించడానికి ఎంతకైనా తెగించే యాంటీ హీరోగా క‌నిపించాడు. ఎంత ప్ర‌య‌త్నించినా మానసికంగా అందుబాటులో లేని తన తండ్రి నుండి ఆమోద ముద్ర పొందడానికి కష్టపడే కొడుకుగా సినిమా ఆద్యంతం క‌నిపించాడు. తండ్రితో అతడి అనారోగ్యక‌ర‌ సంబంధం భార్య(ర‌ష్మిక‌)తో బంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రణబీర్ కపూర్ పాత్రను సవాలు చేసే వాడిగా బాబీ డియోల్ కోల్డ్ బ్లడెడ్ ప్రతినాయకుడిగా నటించాడు. పార్ట్ 2లో అబ్రార్ వ‌ర్సెస్ ర‌ణ్ విజయ్ ఎపిసోడ్స్ మ‌రింత భీక‌ర యాక్ష‌న్ తో సాగుతాయ‌ని అంచ‌నా ఉంది. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.