బాబిడియోల్ కెరీర్ బెస్ట్ రోల్ పోషించబోతున్నాడా?
`యానిమల్` చిత్రంలో అబ్రార్ గా నటించాడు బాబి డియోల్. చెవిటి మూగవాడిగా సైగలతోనే మాట్లాడే పాత్రలో బాబి నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు
By: Tupaki Desk | 9 May 2025 7:00 PM IST`యానిమల్` చిత్రంలో అబ్రార్ గా నటించాడు బాబి డియోల్. చెవిటి మూగవాడిగా సైగలతోనే మాట్లాడే పాత్రలో బాబి నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిజానికి అది అతడి కెరీర్ ఉత్తమ పాత్రలలో ఒకటి. ఆ తర్వాత సూర్య కంగువలోను విలన్ గా నటించినా ఆశించిన మైలేజ్ దక్కలేదు. అబ్రార్ లాంటి మిరాకిల్స్ అరుదుగానే సాధ్యమవుతాయని అతడికి అర్థమైంది.
అయితే మరోసారి అతడు పాత్ బ్రేకింగ్ రోల్ కోసం వేచి చూస్తున్న సమయంలో కరణ్ జోహార్ అద్భుతమైన పాత్రను ఆఫర్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు నాగినుల ప్రపంచంలో ప్రత్యేకమైనవాడిగా కనిపిస్తాడట. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం వేచి చూస్తున్న కరణ్ కి బాబి డియోల్ అయితే సరిపోతాడని భావించినట్టు తెలిసింది. ఈ పాత్ర కోసం బాబి డియోల్, అనీల్ కపూర్ రేస్ లో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. అయితే నాగ్ జిల్లా ప్రయోగాత్మక చిత్రం. నాగదేవతలు, నాగుపాములతో ఆద్యంతం రక్తి కట్టించే విజువల్స్ ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇలాంటి సినిమాలో విలన్ పాత్రకు అనీల్ కపూర్ కంటే బాబి డియోల్ సూటబుల్ అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే అతడి ఎంపికను కరణ్ జోహార్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. త్వరలోనే కాస్టింగ్ వివరాల్ని ప్రకటించే వీలుందని కూడా తెలుస్తోంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి మృగ్‌దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఫాంటసీ కామెడీ జానర్ స్క్రిప్టును ధర్మ ప్రొడక్షన్స్ వర్కవుట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ధర్మ ప్రొడక్షన్ లో తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ చిత్రంలోను కార్తీక్ ఆర్యన్ నటించాల్సి ఉంది. అతడు బ్యాక్ టు బ్యాక్ ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలకు ఓకే చెబుతుండడం ఆశ్చర్యకరం.