'యానిమల్' విలన్ చనిపోవాలనుకున్నాడా?
అలాంటి బాబీ కెరీర్ ని మళ్లీ టాప్‌లో నిలబెట్టిన సినిమా 'యానిమల్'. సందీప్‌రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమాలో కనిపించేది తక్కువ టైమే అయినా అబ్రార్ హక్ క్యారెక్టర్‌లో తనదైన నటనతో సంచలనం సృష్టించాడు.
By: Tupaki Desk | 6 April 2025 1:00 PM ISTఎప్పుడు ఎవరి జీవితం ఎలంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణం తీరికలేకుండా బిజీ బిజీగా గడిపేవాళ్లు ఉన్న ఫలంగా ఏపని లేకుండా ఇంటికే పరిమితం కావచ్చు. ఎలాంటి పని లేని వాళ్లు రాత్రికి రాత్రే బిజీ కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణం. ఇక్కడ రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతుంటాయి. అదే స్థాయిలో షాక్‌లు కూడా తగులుతుంటాయి. అలాంటి ఓ విచిత్రమైన సంఘనే ఓ బాలీవుడ్ నటుడి జీవితంలో జరగింది. ఆయన మరెవరో కాదు బాబీ డియోల్.
బాబీ డియోల్ లైఫ్ ని 'యానిమల్'కు ముందు.. తరువాత అనే చూడాలి. ఈ సినిమాకు ముందు బాబీ డియోల్ దాదాపు 15 ఏళ్ల పాటు ఎలాంటి పని లేకుండా, ఎలాంటి అవకాశం లేకుండా కేవలం భార్య సంపదనతో బ్రతికాడంటే నమ్ముతార?..యస్ బాబీ డియోల్ ఒకప్పుడు బాలీవుడ్‌లో పేరున్న హీరో. ధరమ్‌వీర్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణం మొదలు పెట్టారు. హీరోగా 'బర్సాత్' మూవీలో సెన్సేషనల్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన ఈ సినిమాలో బాబీ డియోల్ బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
ఆ తరువాత గుప్త్, ఔర్ ప్యార్ హోగయా, కరీబ్, సోల్జర్, దిల్లగి, బిచ్చూ వంటి తదితర సినిమాలతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న బాబీ డియోల్ ఆ తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాల్ని దక్కించుకోలేకపోయాడు. దాదాపు 15 ఏళ్ల పాటు ఎలాంటి పని లేకపోవడంతో భార్య సంపాదనతో బ్రతకాల్ని వచ్చిందట. ఒక దశలో తండ్రి గురించి పెద్దగా తెలిసియని పిల్లలు 'అమ్మా నాన్న అసలు పనే చేయడా? ' అని అడగడంతో ఆ మాటలు విన్న బాబీడియోల్ చనిపోవాలనుకున్నాడట.
అలాంటి బాబీ కెరీర్ ని మళ్లీ టాప్‌లో నిలబెట్టిన సినిమా 'యానిమల్'. సందీప్‌రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమాలో కనిపించేది తక్కువ టైమే అయినా అబ్రార్ హక్ క్యారెక్టర్‌లో తనదైన నటనతో సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో మళ్లీ బిజీ అయినా బాలీడియోల్ ఇప్పుడు సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ బాబి రూపొందించిన 'డాకు మహారాజ్'లో బాబీ డియోల్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో దర్శకుడితో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారట.
ఈ విషయాన్ని దర్శకుడు బాబి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'యానిమల్' సినిమాకు ముందు బాబీ డియోల్ బాలీవుడ్ డైరెక్టర్లకు షొటోలు పంపించి అవకాశాలు అడిగితే లుక్ బాగుంది. చెబుతాం అని ముఖం చాటేసేవారట. ఆ సమయంలోనే మీ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు' అని చెప్పాడు. అంతే కాకుండా సందీప్ పేరు తీస్తే బాబీ డియోల్ వెంటనే ఎమోషనల్ అయిపోతాడని, ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి అన్ని భాషల దర్శకులు ఎదురు చూస్తున్నారని, నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయన ఏది పడితే అది అంగీకరించడం లేదని, సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారని, తనకు కిక్‌లేకపోతే అంగీకరించడం లేదని దర్శకుడు బాబి తెలిపారు.