Begin typing your search above and press return to search.

రైతు ఉద్య‌మం వేళ 157 బ్లాస్ట్!

మెగాస్టార్..ముర‌గ‌దాస్ ని అప్రోచ్ అయిన నేప‌థ్యంలో మురుగ‌దాస్ త‌న ద‌గ్గ‌ర రెడీగా ఉన్న ఓ స్టోరీ ని వినిపించి మెప్పించారు? అన్న‌ది తాజా స‌మ‌చారం.

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:30 AM GMT
రైతు ఉద్య‌మం వేళ 157 బ్లాస్ట్!
X

మెగాస్టార్ -ముర‌గ‌దాస్ మ‌రోసారి బ్లాస్ట్ అవ్వ‌బోతున్నారా? ఇద్ద‌రు సైలెంట్ గా ప్లాన్ చేసేసారా? అది 157వ సినిమా అవుతుందా? అంటే అవున‌నే కొత్త వార్త బ‌య‌ట‌కొచ్చింది. 157వ సినిమా విష‌యంలో ఇంకా డైరెక్ట‌ర్ ఫైన‌ల్ కాని సంగ‌తి తెలిసిందే. సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో? అంతా ఛేంజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఎవ‌రు దర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అన్న‌ది దానిపై క్లారిటీ లేకుండా పోయింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా స్టార్ మేక‌ర్ ముర‌గ‌దాస్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. మెగాస్టార్..ముర‌గ‌దాస్ ని అప్రోచ్ అయిన నేప‌థ్యంలో మురుగ‌దాస్ త‌న ద‌గ్గ‌ర రెడీగా ఉన్న ఓ స్టోరీ ని వినిపించి మెప్పించారు? అన్న‌ది తాజా స‌మ‌చారం. ఆ క‌థ ఏంటో తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. అవును దేశం న‌డిబొడ్డున మ‌రోసారి రైతు ఉద్య‌మానికి రెడీ అవుతోన్న నేప‌థ్యంలో ..ఛ‌లో ఢిల్లీ అంటూ రైతులు పిలుపునిచ్చిన సంద‌ర్భంలో మెగాస్టార్ -ముర‌గ‌దాస్ ఎవ్వ‌రూ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ వార్త‌తో రాబోతున్నారు అన్న వార్త మెగా క్యాప్ నుంచి లీకైంది.

2020లో రైతులు చేప‌ట్టిన ఢిల్లీ ఉద్య‌మం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. పంటలకు కనీస మద్దతు ధర పై కేంద్రం రూపొందించినటువంటి చట్టంపై రైతులు ఆందోళన...ఆక్రంద‌న నాలుగేళ్ల క్రితం ఓ సంచ‌ల‌నం. ఆ ఉద్య‌మం పార్ల‌మెంట్ నే కుదిపేసింది. ఇప్పుడు అదే అంశాన్ని ఆధారంగా చేసుకుని మురుగ‌దాస్ క‌థ సిద్దం చేసారని...అదే స్టోరీ చిరంజీవికి వినిపించి లాక్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

మ‌రోసారి పంజాబ్- హర్యానా రైతులు ఉద్య‌మానికి పిలుపునిచ్చి ముందుకొచ్చిన వేళ ఇదే అంశంతో సినిమా వ‌స్తుంది ? అన్న ప్ర‌చారం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటో? అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కూ గానీ క్లారిటీ రాదు. సామాజిక అంశాలతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాలు చేయ డం అన్న‌ది మురుగ‌దాస్ కి కొట్టిన పిండి. అత‌ను ఏ సినిమా చేసినా త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. ఇదే నిజ‌మైతే మెగాస్టార్ తో మ‌రోసారి సంచ‌ల‌నమే అనొచ్చు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో `స్టాలిన్` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.