Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి గ్గర్జన​.. రేంజ్ పెరిగింది!

తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది మూవీ టీమ్. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో కలిపి మొత్తంగా 54 స్క్రీన్స్ ను అదనంగా యాడ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 2:45 PM GMT
భగవంత్ కేసరి గ్గర్జన​.. రేంజ్ పెరిగింది!
X

'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి వరుస బ్లాక్​ బాస్టర్స్​ తర్వాత ముచ్చటగా మూడోసారి 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్​ సక్సెస్​ను ఖాతాలో వేసుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ సినిమా మొదటి రోజే ఫస్ట్ షో నుంచే విశేష స్పందన అందుకుంటూ థియేటర్స్ లో గర్జిస్తోంది. తొలి రోజే లియో సినిమాతో తీవ్ర పోటీ, రెండో రోజు నుంచి లియో, టైగర్ నాగేశ్వరరావుతో తీవ్ర పోటీ ఉన్నపటికీ డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తోంది.

బాక్సాఫీస్​ వద్ద రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. దీంతో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్, డిమాండ్ చూసి... తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది మూవీ టీమ్. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో కలిపి మొత్తంగా 54 స్క్రీన్స్ ను అదనంగా యాడ్ చేస్తున్నారు.

ప్రతి సెంటర్ లో థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డ్ లతో నిండిపోతూ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు పోతెట్టున్నారు. దసరా సెలవులు కావడం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చింది. అందుకే కుటుంబ ప్రేక్షకులు.. పిల్లలతో కలిసి భారీగా తరిలి వెళ్తున్నారు. వచ్చే మూడు రోజులు ఉద్యోగాలు చేసుకునేవారికి కూడా హాలీడేస్ కావడం మరింత బాగా కలిసి వచ్చినట్టు అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఇకపోతే చిత్రంలో బాలకృష్ణ తో పాటు యంగ్ సెన్సేషనల్ శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించింది. బాలయ్య-ఈ ముద్దుగుమ్మ తండ్రి కూతురిగా ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. అనిల్ రావిపూడి కథను మాస్ ఎలిమెంట్స్ - సోషల్ మెసేజ్ తో బాగా హ్యాండిల్ చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్​ అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించారు. తమన్ మ్యూజిక్‌ కూడా బాగుంది. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

ఈ సినిమాలో.. బాల‌కృష్ణ - శ్రీలీల యాక్టింగ్​, క‌థాంశం, డైలాగ్స్​, ఎమోషన్స్​, క్లైమాక్స్​సీన్స్​ హైలైట్​గా ఉన్నాయని... ప్ర‌థ‌మార్ధంలో కొన్ని సీన్స్​ బలహీనతలుగా ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. ఫైనల్​గా ఈ దసరి బరిలో భగవంత్ కేసరి విజేతగా నిలిచిండు.