Begin typing your search above and press return to search.

బిత్తిరి సత్తిని ప్రకాష్ రాజ్ అలా అన్నారా? ఏం జరిగిందంటే?

ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. "ప్రకాష్ రాజ్ గారిని మొదటి రోజు చూసినప్పుడు ఏరా అని పిలిచారు. ఎందుకలా అంటున్నారని అడిగితే.. ఇలా కూడా అంటారా? అని ఆయన సరదాగా మాట్లాడారు.

By:  M Prashanth   |   11 Feb 2026 2:09 PM IST
బిత్తిరి సత్తిని ప్రకాష్ రాజ్ అలా అన్నారా? ఏం జరిగిందంటే?
X

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం సీతా పయనం. తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ ను హీరోయిన్‌ గా పరిచయం చేస్తూ ఆ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఆ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఆ మూవీలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ జంటగా నటిస్తుండగా.. అర్జున్ సర్జాతో పాటు ప్రకాష్ రాజ్, సత్యరాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ, సిరి హనుమంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ హీరో ధ్రువ సర్జా గెస్ట్ రోల్ పోషించడం విశేషం. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నటుడు, కమెడియన్ బిత్తిరి సత్తి చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో జరిగిన ఫన్నీ మూమెంట్స్ నవ్వులు పూయించాయి.

ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. "ప్రకాష్ రాజ్ గారిని మొదటి రోజు చూసినప్పుడు ఏరా అని పిలిచారు. ఎందుకలా అంటున్నారని అడిగితే.. ఇలా కూడా అంటారా? అని ఆయన సరదాగా మాట్లాడారు. తర్వాత కూడా రా అంటూ పిలిచేవారు. మొదట కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. మాట్లాడకూడదనుకున్నా.. ఆయన పెద్దాయన కాబట్టి అలా పిలుస్తున్నారని తర్వాత అర్థమైంది" అని చెప్పారు. ఇలాంటివి చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయని ఆయన గుర్తుచేశారు.

సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. "ఇప్పటివరకు చూడని విధంగా కొత్తగా కనిపిస్తాను. నా కోసం స్క్రిప్ట్‌ లో మార్పులు చేసి అర్జున్ సర్ ప్రత్యేకంగా గైడ్ చేశారు. సినిమా జర్నీలో చాలా మందిని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది" అన్నారు. అర్జున్ సర్జా పనితీరు ప్రశంసిస్తూ.. "స్టార్ డమ్ అన్నది పక్కన పెట్టి డీవోపీ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు అన్నీ తానే చూసుకుంటారు. సినిమా కోసం ఎంత కష్టపడతారో సెట్స్‌ లో చూస్తే తెలుస్తుంది" అని అన్నారు.

సౌత్ ఇండియా బ్రూస్ లీ లా ఉంటారని, బిజ్జల దేవా ఇప్పుడు పగలగొడితే ఆయన ఎప్పుడో పగలు గొట్టేశారని తెలిపారు. నిర్మాతగా డబ్బులు పెట్టి కూడా ఎక్కడా రాజీపడరని అని తెలిపారు. కూతురిని హీరోయిన్‌ గా పరిచయం చేస్తూ దగ్గరుండి చూసుకోవడం తండ్రిగా గొప్ప విషయం అని ఆయన కొనియాడారు. నిరంజన్, సత్యరాజ్, మిగతా టీమ్ సభ్యులందరూ ఎంతో సహకరించారని చెప్పారు.

రాహుల్, మధుప్రియ మంచి పాటలు అందించారని, సాయి మాధవ్ డైలాగ్స్ సినిమాకు హైలైట్ అవుతాయని పేర్కొన్నారు. మొత్తానికి సీతా పయనం మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే విధంగా ఉంటుందని మేకర్స్ పలుమార్లు చెప్పారు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ కూడా ఇచ్చారు. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.