Begin typing your search above and press return to search.

'ఓజీ' మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ వచ్చింది చూశారా

మాఫియా నేపథ్యం లో రూపొందుతున్న ఓజీ సినిమా ని ఓ రేంజ్ లో రూపొందిస్తున్న దర్శకుడు సాహో సుజీత్‌ పుట్టిన రోజు నేడు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:45 AM GMT
ఓజీ మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ వచ్చింది చూశారా
X

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్‌ భగత్ సింగ్ మరియు సాహో సుజీత్‌ దర్శకత్వం లో ఓజీ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మూడు సినిమాల్లోకి పవన్ అభిమానుల్లో అత్యధికంగా సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ' సినిమా పై అంచనాలు, ఆసక్తి ఎక్కువ ఉంది అనడంలో సందేహం లేదు.

పవన్‌ కళ్యాణ్‌ ని ఆయన అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలా ఓజీ లో దర్శకుడు సుజీత్‌ చూపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్ అయిన పిక్చర్స్ మరియు వీడియో లను బట్టి అర్థం అవుతుంది. అధికారికంగా కూడా అదే విధంగా సుజీత్‌ ప్రచారం చేస్తున్నాడు. కనుక ఓజీ ని త్వరగా విడుదల చేయాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మాఫియా నేపథ్యం లో రూపొందుతున్న ఓజీ సినిమా ని ఓ రేంజ్ లో రూపొందిస్తున్న దర్శకుడు సాహో సుజీత్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడి యొక్క పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

సుజీత్‌ మొదటి సినిమా తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని చిన్న వయసు లో, ఒక్క సినిమా అనుభవంతో ఏకంగా ప్రభాస్ తో సాహో సినిమా ను రూపొందించే అవకాశం దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ లో సాహో మంచి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ఇప్పుడు పవన్ తో ఆయన రూపొందిస్తున్న సినిమా కూడా పవన్‌ ని బాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువ చేస్తుందని అంటున్నారు.

ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ చేసిన పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ కారణాల వల్ల ఓజీ కి మాత్రమే కాకుండా ఇతర ఏ సినిమాలకు కూడా డేట్లు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. దాంతో ఓజీ సినిమా ఈ ఏడాదిలోనే వస్తుందని భావించినా కూడా ఆ పరిస్థితి లేదని తేలిపోయింది. ఓజీ కోసం పవన్ ఫ్యాన్స్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.