Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బ‌ర్త్ డే బేబి టూ హాట్ గురూ

దీనికి క్యాప్షన్ ఇలా ఉంది, ``ఈ ప్రయాణంలో బ‌ర్త్ డే బేబీ పూజా మాతో చేరడంతోథ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ మరింత ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచుతోంది. మా లవ్లీ లీడింగ్ లేడీకి సంతోషకరమైన రోజు శుభాకాంక్షలు!`` అని రాసారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:04 AM GMT
ఫోటో స్టోరి: బ‌ర్త్ డే బేబి టూ హాట్ గురూ
X

టాలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి మిస్స‌యిన పూజా హెగ్డే, ప్ర‌స్తుతం బాలీవుడ్ కెరీర్ ని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ఉంది. తాజాగా ఈ భామ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా కొత్త సినిమాని ప్ర‌క‌టించింది. పూజాకు సౌండ్ లేదేమీ అని కామెంట్ చేసేవాళ్ల‌కు ఇది స‌రైన స‌మాధానం. షాహిద్ లాంటి ప‌రిశ్ర‌మ అగ్ర‌హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుని పూజా త‌న అభిమానుల‌కు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చింది.


ఇంత‌లోనే పూజా హెగ్డే పుట్టినరోజును ఆన్ లొకేష‌న్ సెల‌బ్రేట్ చేస్తూ షాహిద్ టీమ్ గ్రాండ్ వెల్కం చెప్పింది. షాహిద్ కపూర్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, దర్శకుడు రోషన్ ఆండ్రూస్‌తో కలిసి తన కొత్త చిత్రం సెట్స్‌లో బ‌ర్త్ డే బేబి పూజా ఉల్లాసంగా గడిపారు. సెట్స్ పైకి పూజా హెగ్డేని స్వాగతిస్తూ, రాయ్ కపూర్ ఫిల్మ్‌ల అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. దీనికి క్యాప్షన్ ఇలా ఉంది, ``ఈ ప్రయాణంలో బ‌ర్త్ డే బేబీ పూజా మాతో చేరడంతోథ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ మరింత ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచుతోంది. మా లవ్లీ లీడింగ్ లేడీకి సంతోషకరమైన రోజు శుభాకాంక్షలు!`` అని రాసారు. పూజా హెడ్గే - షాహిద్ కపూర్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్- దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఈ వేడుక‌లో పాల్గొన్నారు. బ‌ర్త్ డే బేబీ పూజా కేక్ క‌టింగ్ చేస్తూ పోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

పూజా హెగ్డే తన వేడుకల నుండి ఇన్‌స్టా ఫీడ్‌లో షేర్ చేసింది. ఇందులో పూజా బీచ్ లొకేషన్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలు వేడి పెంచాయి. చెర్రీలతో అలంక‌రించిన వైట్ కేక్ స్లైసీగా క‌నిపిస్తోంది. అంత‌కుమించి పూజా టూపీస్ లుక్ స్లైస్ లో స్పైస్ ని యాడ్ చేసింద‌ని చెప్పాలి. పూజా అందంగా న‌వ్వుతూ బ‌ర్త్ డే కేక్ వైపే లాల‌న‌గా చూస్తూ క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ని ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. అది అంద‌మైన న‌వ్వు! అంటూ పూజా స్మైల్ కి కాంప్లిమెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయ్. పూజా టూ హాట్ లుక్ అంటూ మ‌రొక అభిమాని పొగిడేసాడు.

తన ఇన్‌స్టాగ్రామ్ లో పూజ ఒక రీల్‌ను షేర్ చేసింది. ఇందులో షాహిద్ కపూర్ పూజాను చిన్న కేక్ ముక్కను అడిగాడు. `హ్యాపీ బర్త్‌డే టు యు` అని పాడాడు. పూజ క్యాప్షన్‌లో ఇలా రాసింది. ``బార్ బార్ ఆడకపోతే ఇది పుట్టినరోజు కూడానా?!`` అంటూ ఎగ్జ‌యిట్ అయింది. పూజా హెగ్డే చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో కనిపించింది. పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌లో, మ‌హేష్ తో గుంటూరు కారం చిత్రాల్లో న‌టించాల్సి ఉన్నా పూజా అనూహ్యంగా వాటి నుంచి వైదొల‌గిన సంగ‌తి తెలిసిందే. షాహిద్ తో ప్ర‌స్తుత‌ సినిమా టైటిల్‌ను ఇంకా వెల్లడించాల్సి ఉంది