బయోపిక్ ల మీద భారీగా ఖర్చుపెడుతున్న ప్రొడ్యూసర్స్... వాళ్ళ ధైర్యం ఏంటి..?
బాలీవుడ్ లో ఫరాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో 'బాగ్ మిల్కా బాగ్' అనే సినిమా తెరకెక్కింది.
By: Tupaki Desk | 20 Sept 2026 11:00 PM ISTప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఇంతకు ముందు వచ్చిన బయో పిక్ లు అద్భుతమైన విజయాలను సాధించడంతో చాలా మంది సెలబ్రిటీల జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు... కొన్ని రంగాల్లో వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి సినిమాగా తీస్తే అది అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే వాళ్ళ కష్టాలు, నష్టాలు వాళ్లు దానిని సాధించడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే విషయాలను కండ్లకు కట్టినట్టుగా చూపిస్తే సినిమా ఈజీగా ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేస్తుందనే ఉద్దేశ్యంతోనే దర్శక నిర్మాతలు దాన్ని క్యాష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సెలబ్రిటీల బయోపిక్ తీస్తున్నారు అంటే ప్రతి ఒక్కరి అటెన్షన్ ఆ సినిమా మీదనే ఉంటుంది. ఆ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి అలాంటి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ సైతం భారీ ఎత్తున బడ్జెట్ ను కేటాయించడానికి సైతం వెనకాడడం లేదు... ఇప్పటి వరకు సక్సెస్ అయిన కొన్ని బయో పిక్ ల గురించి చూద్దాం...
బాగ్ మిల్కా బాగ్
బాలీవుడ్ లో ఫరాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో 'బాగ్ మిల్కా బాగ్' అనే సినిమా తెరకెక్కింది. ఇది ప్రముఖ అథ్లెట్ అయిన 'మిల్కా సింగ్' జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఆయన తన గోల్ ను రీచ్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించారు. ఫారానక్తర్ ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి నటించాడనే చెప్పాలి. ఫైనల్ గా ఈ బయోపిక్ కి మంచి గుర్తింపు రావడమే కాకుండా పెద్ద మొత్తంలో కలెక్షన్స్ ను సైతం రాబట్టింది...
ధోనీ (ది ఆన్ టోల్డ్ స్టోరీ)
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయిన 'మహేంద్రసింగ్ ధోని' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...ఆయన కెప్టెన్ గా ఉండి టి20 వరల్డ్ కప్, అలాగే వన్డే వరల్డ్ కప్ ని సాధించి పెట్టాడు. కాబట్టి ధోని బయోపిక్ తీస్తే అందరికీ కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఈ సినిమాను చేశారు... 'సుశాంత్ సింగ్ రాజ్ పుత్' ధోని క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా పోషించాడు. 'నీరజ్ పాండే' దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టి పలు రికార్డులను సైతం తిరగరాసింది. ధోని క్రికెటర్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఇందులో చాలా క్లియర్ గా చూపించారు...
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో వచ్చిన 'మహానటి' సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది... ఒకప్పటి అందాల తార ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న 'మహానటి సావిత్రి' జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సావిత్రి నటిగా మారడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె స్టార్ డమ్ ని అందుకున్న తర్వాత ఎవరెవరు ఆమెను మోసం చేశారనే విషయాలను చాలా క్లియర్ గా చూపించారు. కాబట్టి ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది. తద్వారా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది...
ఇక ఇప్పుడు ప్రముఖ భారతీయ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అలాగే గాయని అయిన 'ఎం ఎస్ సుబ్బలక్ష్మి' గారి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందాన మెయిన్ లెడ్ లో నటిస్తుంది. 'జెర్సీ' మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న 'గౌతమ్ తిన్ననూరి' దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది...
మొత్తానికైతే ఈ రోజుల్లో బయోపిక్ లకు చాలా మంచి క్రేజ్ ఉండడంతో ప్రస్తుతం ఉన్న దర్శకులు నిర్మాతలు వాటిని తెరకెక్కించి ఈజీగా సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే కొన్ని బయోపిక్ లు సూపర్ సక్సెస్ సాధిస్తే మరికొన్ని బయోపిక్ లను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బయోపిక్ ల జోలికి వెళ్తే బాగుంటుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలు బయో పిక్ లు ఎందుకు తీస్తున్నారు అనే విషయం పక్కనపెడితే, ఇలాంటి సినిమాలు చేయడం వల్ల పలు రంగాల్లో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకున్న గొప్ప వ్యక్తుల జీవిత కథ నెక్స్ట్ జనరేషన్ కి తెలిసే అవకాశమైతే ఉంటుంది. అందుకే ఇంకా ఎక్కువ బయోపిక్ లు వస్తే ఇప్పుడున్న యూత్ కి లైఫ్ లో ఎలా పోరాడాలి ఎలా కష్టపడితే మనం జీవితంలో సక్సెస్ అవుతాం అనే విషయంలో క్లారిటీ వచ్చి జీవితం మీద కసి పెరుగుతుంది. ఫైనల్ గా ఇవి వాళ్ళకు ఒక మోటివేషనల్ మూవీస్ గా మారుతాయి...
