Begin typing your search above and press return to search.

వేశ్య పాత్ర నిజమే.. కానీ ఆ సీన్స్ ఉండవు!

తెలుగు ప్రేక్షకులకు బిందు మాధవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   17 April 2025 12:52 PM IST
Bindu Madhavi to Play a Se*x Worker in Dhandora
X

తెలుగు ప్రేక్షకులకు బిందు మాధవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు దాటినా ఆరంభంలో ఎలా అయితే అందంగా కనిపించేదో అలాగే అందంగా కనిపిస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ చాలా సినిమాలు చేసిన బిందు మాధవి అక్కడ బిగ్ బాస్ షో లో పాల్గొంది. అక్కడ కొన్ని వారాలకే ఎలిమినేట్ అయింది. ఆశ్చర్యకరంగా తెలుగు బిగ్‌బాస్‌ ఓటీటీ వర్షన్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది. తెలుగు బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించిన బిందు మాధవి ఏకంగా లేడీ సింగం అంటూ కప్‌ ఎత్తింది. బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌గా నిలవడంతో బిందు మాధవి టాలీవుడ్‌లో బిజీ అవుతుందని అంతా భావించారు.

బిగ్‌బాస్ ట్రోఫీ లిఫ్ట్‌ చేసిన తర్వాత బిందు మాధవి పెద్దగా కనిపించలేదు. అప్పుడప్పుడు బుల్లి తెరపై కనిపించిన ఈమె అరుదుగా వెండి తెరపై కనిపించింది. మెల్ల మెల్లగా బిందు మాధవి కనుమరుగు అవుతుందని భావిస్తున్న సమయంలో ధండోరా అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. గత రెండు రోజులుగా బిందు మాధవి దండోరా సినిమా విషయమై ప్రముఖంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించబోతుందని సమాచారం అందుతోంది. దాంతో సినిమాలోని సన్నివేశాల గురించి ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు.

బిందు మాధవి 'ధండోరా' సినిమా కోసం బోల్డ్‌ సీన్స్‌లో కనిపించబోతుందని, కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా హద్దులు దాటి బోల్డ్‌ కంటెంట్‌లో బిందు మాధవి నటించేందుకు ఓకే చెప్పిందనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయమై ప్రముఖంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యులతో పాటు, బిందు మాధవి టీం నుంచి క్లారిటీ వచ్చింది. ధండోరా సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తున్న విషయం నిజమే అయినప్పటికీ అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువ ఉండదని, బోల్డ్ సీన్స్ అస్సలు ఉండవు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల వారు చూసే విధంగా డీసెంట్‌ కంటెంట్‌తో సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

వేశ్య పాత్ర అనగానే చాలా మంది బోల్డ్‌ కంటెంట్‌ను ఊహించుకుంటున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి వచ్చిన క్లారిటీతో పుకార్లకు చెక్‌ పడ్డట్లు అయింది. బిందు మాధవి వంటి హీరోయిన్‌తో బోల్డ్‌ కంటెంట్‌ తీసినా కచ్చితంగా ప్రేక్షకుల తిరస్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మేకర్స్ ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అడల్ట్‌ కంటెంట్‌కి దూరంగా ఉండటం అనేది మంచి విషయం అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గ్రామీన నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తూ ఉండగా, రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. సినిమాలో అడల్ట్‌ కంటెంట్‌ కంటే భావోద్వేగాలను చూపించే కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరు ఎమోషనల్‌ అయ్యే విధంగా సినిమా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.