Begin typing your search above and press return to search.

2209 ఏడాదికి జర్నీ షురూ..!

కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ హీరోగా అనుపభండారి దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'బిల్లా రంగ భాష' (#BRB) సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది.

By:  Tupaki Desk   |   16 April 2025 2:56 PM IST
2209 ఏడాదికి జర్నీ షురూ..!
X

అన్ని భాషల ఇండస్ట్రీలో ఎక్కువ శాతం ప్రస్తుత కాలంలో జరిగే కథలను చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పీరియాడిక్‌ నేపథ్యంలో అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి, గతంలో జరిగి పోయిన కాలంలో జరిగిన కథ అంటూ చూపిస్తూ ఉంటారు. పూర్వ కాలపు కథలు, రాజుల కాలపు కథలు, బ్రిటీష్‌ కాలపు కథలు, 1980, 70 కథలను ఇప్పటి వరకు ప్రేక్షకుల మందుకు తీసుకు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్‌కి సంబంధించిన కథలతో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. గత ఏడాది వచ్చిన ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా ప్రేక్షకులను ఫ్యూచర్‌లోకి తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఫ్యూచర్‌లోకి తీసుకు వెళ్లబోతున్నారు.


కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ హీరోగా అనుపభండారి దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'బిల్లా రంగ భాష' (#BRB) సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సినిమాను అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరిపిన మేకర్స్ ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించారు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కావడంతో వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కన్నడ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి అనూప్‌ భండారి చాలా రీసెర్చ్‌ చేసి, హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌తోనూ చర్చలు జరిపి ఈ సినిమా కథను రెడీ చేశారని తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేసే విధంగా దర్శకుడు పక్కా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్‌ వీడియోను, లోగోను రివీల్‌ చేశారు. సినిమాకు ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. 2209 ఏడీ కి ప్రేక్షకులను తీసుకు వెళ్లే విధంగా దర్శకుడు అనూప్‌ స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేశాడు. విభిన్నమైన ఈ కాన్సెప్ట్‌లో కిచ్చా సుదీప్‌ పాత్ర ఏంటి అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ టెక్నికల్‌ బ్రిలియన్స్‌ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్‌ సైన్స్ ఫిక్షన్‌ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని, హాలీవుడ్‌లోనూ విడుదల చేసే విధంగా అద్భుతమైన యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నేటి నుంచి బిల్లా రంగ భాష ప్రయాణం మొదలు కాబోతుంది. వచ్చే ఏడాదికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ సినిమాలో నటించే నటీనటుల విషయమై మరింతగా క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడం, తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. రికార్డ్‌ స్థాయి కలెక్షన్స్‌ నమోదు చేయడం ఖాయం అనే ధీమాతో మేకర్స్ ఉన్నారు.