Begin typing your search above and press return to search.

అశ్లీల చిత్రాల‌ కేసు: శిల్పాశెట్టి భర్తకు బిగ్ రిలీఫ్‌

రాజ్ కుంద్రాకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ముందు దాదాపు రెండు నెలల పాటు జైలులో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 6:45 PM GMT
అశ్లీల చిత్రాల‌ కేసు: శిల్పాశెట్టి భర్తకు బిగ్ రిలీఫ్‌
X

వ్యాపారవేత్త శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గత సంవత్సరం తన పేరును అశ్లీలత కేసులో అటాచ్ చేయడంతో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. అడల్ట్ ఫిల్మ్‌లను రూపొందించి యాప్ ల ద్వారా పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై సెప్టెంబరు 2021లో అరెస్టయ్యాడు. రాజ్ కుంద్రాకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ముందు దాదాపు రెండు నెలల పాటు జైలులో ఉన్నాడు. ఇప్పటికి రెండేళ్లు కావస్తున్నా కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

అయితే ఈ కేసులో కీల‌క‌మైన అప్ డేట్ అందింది. దాని ప్ర‌కారం..ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాజ్ కుంద్రాతో అశ్లీల రాకెట్ ప్రత్యక్ష సంబంధాన్ని కనుగొనలేదని వెల్లడించింది. అయితే మనీలాండరింగ్ కేసును ED దర్యాప్తు చేస్తోంది.

తాజా క‌థ‌నాల ప్రకారం ఈ మనీలాండరింగ్ కేసులో UK ఆధారిత `కెన్రిన్` అనే కంపెనీ ప్రస్తుతం ED రాడార్ ప‌రిధిలో ఉంది. కెన్రిన్‌కు ఇంకా అనేక షెల్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి కూడా విచారణలో ఉన్నాయి. రాజ్ కుంద్రా బావ కెన్రిన్ యజమాని .. హాట్‌షాట్ యాప్ ప్రమోటర్ అని కూడా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఆర్మ్స్ ప్రైమ్ మీడియా లిమిటెడ్ CEO సౌరభ్ కుష్వా ఒక అసోసియేషన్ కోసం కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి రాజ్ కుంద్రాను సంప్రదించినట్లు ED వర్గాలు వెల్లడించాయి. వారి అనుబంధం 2019 సంవత్సరంలోనే ముగిసిందని క‌థ‌నాలొస్తున్నాయి. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ప్రకారం.. ఈ కేసులో రాజ్ కుంద్రాను ప్రధాన సహాయకుడుగా పేర్కొన్నారు.

జైలులో ఉన్న సమయంలో..

ఇటీవల శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన జైలు జీవితం గురించి ఓపెన్ అయ్యాడు. త‌న జైలు జీవితంపై సినిమాని నిర్మించిన న‌టించిన కుంద్రా.. ఈ సినిమా రిలీజ్‌ ప్రమోషన్స్‌లో అతను జైలులో ఎలా గడిపాడో పుస్తకం రాయాలని ఎలా అనిపించిందని అన్నాడు. అయితే దీనిపై సినిమా తీయాలని అందులో తానే స్వ‌యంగా నటించమని స్నేహితుడు సూచించిన‌ట్టు తెలిపారు.

ఈ కేసులో చట్టపరమైన విచారణ కంటే, మీడియా విచారణ నన్ను బాధించిందని, న‌న్ను తప్పుగా అర్థం చేసుకున్నార‌ని కూడా కుంద్రా అన్నారు. దానితో గుండె పగిలిపోయింద‌ని ఆవేద‌న చెందారు. నా కుటుంబాన్ని క్రిందికి లాగారు. నా కుటుంబం ఏదో అన్యాయం చేసింది! అని ఆయన అన్నారు. తనను తాను `వ్యవస్థ బాధితుడు`గా పేర్కొంటూ.. తనకు అన్యాయం చేసిన వారందరికీ తిరిగి ఇచ్చేందుకే ముసుగు వేసుకున్నానని చెప్పారు.