Begin typing your search above and press return to search.

చిన్న హీరోకి పెద్ద పెద్ద ఆఫర్స్‌

ఆ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకోవడంతో ప్రస్తుతం విక్రాంత్ మాస్సే పేరు మారు మ్రోగుతోంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 2:30 AM GMT
చిన్న హీరోకి పెద్ద పెద్ద ఆఫర్స్‌
X

మీర్జాపూర్‌ వెబ్ సిరీస్ లో చిన్న పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సే ఇటీవల 12th ఫెయిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకోవడంతో ప్రస్తుతం విక్రాంత్ మాస్సే పేరు మారు మ్రోగుతోంది. థియేట్రికల్‌ రిలీజ్ లో హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ లో మరింతగా ప్రేక్షకులను మెప్పిస్తుంది.


విలక్షణ నటనతో తాను నటించిన పాత్రకు ప్రాణం పోసిన విక్రాంత్‌ మాస్సే కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్‌ మొదలయ్యింది. దాంతో ఆయన తో వర్క్‌ చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. అదే సమయంలో ప్రముఖ దర్శకులు కూడా ఆయన్ను సంప్రదిస్తున్నారు.

బాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో విక్రాంత్‌ మాస్సేకి నటించే అవకాశం దక్కింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్ లో రణబీర్ కపూర్‌ నటిస్తున్నాడు. ఆ వెబ్‌ సిరీస్ లో విక్రాంత్ ని కూడా ఒక పాత్రకు ఎంపిక చేశారని తెలుస్తోంది.

కేవలం రాజ్‌ కుమార్‌ హిరానీ వెబ్‌ సిరీస్ లో మాత్రమే కాకుండా తాజాగా యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ లో కూడా సినిమాను చేసేందుకు ఈయనకు అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. అన్ని విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాలీవుడ్‌ స్టార్‌ అంటూ విక్రాంత్‌ మాస్సే ని నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.