Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. మరొకరు కూడా..?

బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాలు మాత్రమే ఉండగా చివరి వారాల్లో ఆట మరింత రసవత్తరంగా మారింది

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:44 AM GMT
బిగ్ బాస్ 7 : స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. మరొకరు కూడా..?
X

బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాలు మాత్రమే ఉండగా చివరి వారాల్లో ఆట మరింత రసవత్తరంగా మారింది. ఈ వారం మొత్తం ఆడియన్స్ ని ఓటింగ్ అడిగేందుకు టాస్క్ పెట్టిన బిగ్ బాస్ ప్రతి టాస్క్ లానే ఇక్కడ కూడా గొడవలతో సాగింది. ముఖ్యంగా సీరియల్ హీరో అమర్ దీప్ రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ల మధ్య గొడవ జరిగింది. టాప్ 3 లో ఈ ఇద్దరు ఉండగా వారిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అన్నది వీకెండ్ నాగార్జున తేల్చి చెప్పాల్సిందే.

ఇక ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆల్రెడీ పూర్తైనట్టు తెలుస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అన్న డౌట్ రాగా ఫైనల్ గా ఈ వారం కేవలం ఒక్క ఎలిమినేషన్ తోనే సరిపెడుతున్నారని తెలుస్తుంది. హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఫినాలే పాస్ గెలుచుకున్న అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ లో ఉన్నారు. సో వారిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారన్నది ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

బయటకు వచ్చిన లీక్స్ ప్రకారం ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. యావర్, శోభా శెట్టి ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండగా ఇద్దరిలో శోభా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇక పల్లవి ప్రశాంత్ తో గొడవ వల్ల అమర్ దీప్ కి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినట్టు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ టాప్ ఓటింగ్ తో దూసుకెళ్తున్నాడు.

ప్రియాంకాకి కూడా తక్కువ ఓటింగ్ ఉంది. ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నెక్స్ట్ వీకెండ్ షో పూర్తవుతుంది. ఈలోగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదైనా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో ఎవరు టాప్ 5కి వెళ్తారన్నది చూడాలి. శివాజి టాప్ 2గా కొనసాగుతున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ వీరి ముగ్గురి మధ్య విజేత ఉంటారని తెలుస్తుండగా అమర్ దీప్ కి ఈమధ్య ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. అయితే టాప్ 5 లో ఒక్క ఫిమేల్ కంటెస్టెంట్ అయినా ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. యావర్, ప్రియాంకా వీరిద్దరిలో ఎవరికి టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఆడియన్స్ ఇస్తారన్నది చూడాలి.