Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : పర్ఫార్మెన్స్ లో ఎవరు తగ్గట్లేదు..!

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఆట మరింత రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేశాడు

By:  Tupaki Desk   |   20 Sep 2023 8:56 AM GMT
బిగ్ బాస్ 7 : పర్ఫార్మెన్స్ లో ఎవరు తగ్గట్లేదు..!
X

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఆట మరింత రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. అందుకే మూడో హౌస్ మెట్ గా.. పవర్ అస్త్ర పొందేందుకు బిగ్ బాస్ డైరెక్ట్ గా అమర్ దీప్, శోభా శెట్టి, యావర్ లను ఎంపిక చేశాడు. లాస్ట్ వీక్ టాస్క్ పర్ఫార్మెన్స్ ను బట్టి బిగ్ బాస్ వీరు పవర్ అస్త్ర పోటీ నుంచి చివర్లో వైదొలిగారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చి ఉండొచ్చని అనుకున్నారు. అయితే ఈ ముగ్గురు ఎంపిక మీద బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ అసంతృప్తిగా ఉన్నారు.

బిగ్ బాస్ 3 పవర్ అస్త్ర కోసం ఎంపిక చేసిన ఆ ముగ్గురిలో ఎవరిని రేసు నుంచి తొలగించాలో కన్ఫెషన్ రూంలో మిగతా కంటెస్టెంట్స్ అభిప్రాయాలను తెలుసుకున్నాడు. అమర్, యావర్, శోభా శెట్టిలలో కంటెస్టెంట్స్ అంతా వారి మనసులో ఉన్న ఆ కంటెస్టెంట్ పేరుని వెల్లడించారు.

ఇదిలా ఉంటే మరోపక్క రతిక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి శివాజీకి చెప్పి బాధపడింది. హౌస్ లో అందరికీ అతని గురించి తెలుసని తానే చెప్పానని 3 రోజులుగా తన మనసు బాలేదని రతిక శివాజితో షేర్ చేసుకోగా మన ఇష్టాలు సీక్రెట్స్ ఒకరికి చెప్పకూడదని సలహా ఇచ్చారు శివాజి. ఈ క్రమంలో రతిక డల్ గా ఉండగా ప్రశాంత్ ఆమెను డిస్టర్బ్ చేస్తూ నవ్వించడానికి ప్రయత్నించాడు.

రెండో పవర్ అస్త్ర పొందిన శివాజి నుంచి అతని పవర్ అస్త్ర దొంగిలించాలని స్కెచ్ వేశాడు అమర్ దీప్. అయితే మొదటి పవర్ అస్త్ర శుభ శ్రీ దొంగిలించగా దాన్ని వీకెండ్ లో నాగార్జున గూడ్ ప్లాన్ అన్నారు. సో అలానే శివాజి పవర్ అస్త్రని థెఫ్ట్ చేయాలని అమర్ దీప్ ప్రయత్నించాడు. ఇలా అందరు కంటెస్టెంట్స్ ఎవరికి వారు తగ్గకుండా తమ పర్ఫార్మెన్స్ తో అటు ఆటని ఇటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.

నేటి ఎపిసోడ్ లో శివాజి పవర్ అస్త్ర మిస్ అయినట్టు కనిపెట్టి ఎవరు తీశారో వారి పని చూస్తానని అంటున్నాడు. ఈరోజు ప్రోమోలో రతిక యావర్ లు ఒకే ప్లేట్ లో తినడం.. యావర్ రతికకు తినిపించడం చూపించారు. సో ఈరోజు ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే సాగేలా ఉంది.