Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ OTT 2 లో సీజన్ 7 కంటెస్టెంట్..?

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అవ్వడం తో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ OTTని కూడా మొదలు పెట్టాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 10:30 AM GMT
బిగ్ బాస్ OTT 2 లో సీజన్ 7 కంటెస్టెంట్..?
X

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అవ్వడం తో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ OTTని కూడా మొదలు పెట్టాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సెకండ్ సీజన్ మార్చిలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ కేవలం డిస్నీ + హాట్ స్టార్ లో మాత్రమే స్ట్రీమింగ్ ఇచ్చారు. అయితే ఆ సీజన్ ఆశించినంతగా క్లిక్ అవ్వలేదు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ ఫస్ట్ సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ ముందు సీజన్లలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ ని తీసుకున్నారు.

అయితే బిగ్ బాస్ ఓటీటీ 2 లో కూడా అదే ప్లాన్ వర్క్ అవుట్ చేసేలా ఉన్నారు. ముఖ్యంగా సీజన్ 7 లో క్రేజ్ తెచ్చుకున్న కొందరిని బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ లో తీసుకుంటున్నారు. ఓటీటీ సీజన్ 2 లో బిగ్ బాస్ సీజన్ 7 ఫోర్త్ ప్లేస్ లో నిలిచిన యావర్ ని తీసుకుంటున్నారని టాక్. యావర్ కూడా మరోసారి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడానికి ఆసక్తిగా కనిపిస్తున్నాడట. ఎలాగు తనకు రెమ్యునరేషన్ గా మంచి అమౌంట్ ఇస్తారు కాబట్టి యావర్ బిగ్ బాస్ ఓటీటీ 2 కి వెళ్తాడని చెబుతున్నారు.

ప్రిన్స్ యావర్ తో పాటుగా బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ లో నయని పావని కూడా వస్తుందని టాక్. సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయనీ పావని కేవలం ఒక్క వారమే హౌస్ లో ఉంది. అయితే వారం రోజుల్లోనే హౌస్ మెట్స్ తో మంచి బాండింగ్ ఏర్పరచుకుంది. ఆమె ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యారు. సో నయని పావని కూడా బిగ్ బాస్ ఓటీటీ 2 లో వస్తుందని అంటున్నారు.

ఇక సీజన్ 7 లో బోలే శావలి సందడి తెలిసిందే. అతను కూడా బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ లో ఉంటాడని చెబుతున్నారు. సో సీజన్ 7 నుంచి ఓటీటీ 2కి యావర్, నయని పావని, బోలే శావలి వస్తారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సీజన్ 7 లో వీరి మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టి బిగ్ బాస్ ఓటీటీ 2లో వీరి ఆట తీరు బాగుంటుందని చెప్పొచ్చు. సీజన్ 7 లో టైటిల్ విన్నర్ అవ్వలేని యావర్ ఓటీటీ లో అయినా టైటిల్ విజేత అయ్యేందుకు ప్రయత్నిస్తాడేమో చూడాలి.