Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : టాప్ 5 కాదు ఈ ట్విస్ట్ ఊహించలేదుగా..!

బిగ్ బాస్ సీజన్ 7 చివరి వారానికి వచ్చేసింది. 14 సక్సెస్ ఫుల్ వీక్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ వీక్ ఫైనల్ వీక్ కి వచ్చింది

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:16 AM GMT
బిగ్ బాస్ 7 : టాప్ 5 కాదు ఈ ట్విస్ట్ ఊహించలేదుగా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 చివరి వారానికి వచ్చేసింది. 14 సక్సెస్ ఫుల్ వీక్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ వీక్ ఫైనల్ వీక్ కి వచ్చింది. అయితే జరిగిన 6 సీజన్లలో ఎప్పుడు టాప్ 5 ఫైనల్ వీక్ కి ఉంటారు. కానీ సీజన్ 7 కాబట్టి ఈసారి టాప్ 6 ని హౌస్ లో ఉంచారు. ఇంట్లో ఒక్కరైనా అమ్మాయి ఉండాలని అనుకున్నారో ఏమో కానీ బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 5 కాకుండా టాప్ 6 ని ఉంచారు.

అయితే వీరిలో ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5 ని ఎంపిక చేస్తా లేదా టాప్ 6 అలా ఉంచుతారా అన్నది చూడాలి. ఫైనల్ వీక్ లో టాప్ 6 నుంచి నాగార్జున ఒక్కొక్కరిని బయటకు పిలుస్తారు. అలా 6 నుంచి టాప్ 3 దాకా బయటకు పిలుస్తారు. ఆ తర్వాత టాప్ 2 ని హోస్ట్ నాగార్జున వెళ్లి హౌస్ లో నుంచి స్టేజ్ మీదకు తీసుకొస్తారు. బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో ది బెస్ట్ అని తెలుస్తుంది.

సీజన్ 6 అనుకున్న విధంగా సక్సెస్ అవ్వకపోవడంతో సీజన్ 7 చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఈ సీజన్ ఉల్టా పుల్టా టైటిల్ కి తగినట్టుగానే కొన్ని టాస్కులు జరిగాయి. మొదటి రోజు కేవలం 14 మందిని మాత్రమే హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్ ఐదు వారాల తర్వాత మరో ఐదుగురిని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వారిలో అర్జున్ మాత్రమే ఫైనల్ వీక్ దాకా ఉండగలిగాడు.

ఇక ఫైనల్ వీక్ వచ్చేసింది. ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది. టాప్ 3 లో శివాజి, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఈసారి కామన్ మ్యాన్ టైటిల్ గెలుస్తాడని చెప్పుకుంటున్నారు. అయితే అమర్ దీప్, శివాజీ కూడా టైటిల్ రేసులో ఉన్నారు. ఈ వారం వారికి వచ్చే ఓటింగ్ ని బట్టి విన్నర్ ఎవరన్నది డిసైడ్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా నాగార్జున కూడా అదరగొట్టేశారు. ఇన్ని సీజన్లలో ఈ సీజన్ మాత్రం నాగార్జున హోస్టింగ్ పై ఆడియన్స్ కూడా 100కి 100 మార్కులు ఇచ్చేశారు. సీజన్ 7 సక్సెస్ లో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషించారని చెప్పొచ్చు.