Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న పోటుగాళ్లు..!

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఆట గాళ్లు వర్సెస్ పోటుగాళ్లకు రకరకాల టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్

By:  Tupaki Desk   |   12 Oct 2023 9:15 AM GMT
బిగ్ బాస్ 7 : ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న పోటుగాళ్లు..!
X

బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం ఆటగాళ్లు పోటు గాళ్ల మధ్య ఫైట్ జరుగుతుంది. లాస్ట్ వీక్ వరకు హౌస్ లో ఉన్న వారిని ఆటగాళ్లుగా ఈ వీక్ హౌస్ లోకి కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్ ని పోటుగాళ్లు గా బిగ్ బాస్ టైటిల్స్ ఇచ్చాడు. ఈ పోటుగాళ్ల బ్యాచ్ లోనే సీక్రెట్ రూం నుంచి వచ్చిన గౌతం కృష్ణని ఉంచారు. సో అలా ఆటగాళ్ల టీం లో ఎనిమిది మంది.. పోటు గాళ్ల టీం లో ఆరుగురు ఉన్నారు.

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఆట గాళ్లు వర్సెస్ పోటుగాళ్లకు రకరకాల టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. బుధవారం జరిగిన టాస్క్ లల్లో పోటుగాళ్లే ముందంజలో ఉన్నారు. జరిగిన నాలుగు టాస్కుల్లో వారు 3 టాస్క్ లు గెలిచారు. తెలిచిన ప్రతిసారి వారికి ఇచ్చిన బోర్డు మీద నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇక ఈరోజు టాస్క్ లో పోటుగాళ్లు, ఆటగాళ్లలో స్మార్ట్ ఎవరన్నది తెలుసుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఏది ఏమైనా కొత్తగా వచ్చిన పోటుగాళ్లు ఆల్రెడీ హౌస్ లో ఉన్న ఆటగాళ్ల తో పోటీ పడుతూ టాస్క్ ని రసవత్తరంగా మార్చుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ వీక్ నుంచి 2.ఓ అంటూ కొత్త జోష్ నింపుకుంది.

హోస్ట్ నాగార్జున సైతం ఈసారి ప్రతి ఎపిసోడ్ చూస్తూ హోస్టింగ్ చేస్తున్నట్టు ఉంది. సీజన్ 7 ఆరు వారాల రివ్యూ చూస్తే మాత్రం ఈసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఈ సీజన్ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఇక ఈ వారం ఆరుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 7 కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో హౌస్ అంతా సందడి సందడిగా ఉంది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ లో అర్జున్, భోలే శావలి మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. ఇక మిగిలిన వారిలో పూజా, అశ్విని, నయని పావని కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ వారం పూజా, నయని పావన్, అశ్విని ముగ్గురు నామినేషన్స్ లో ఉండటం విశేషం.