Begin typing your search above and press return to search.

2 వారాలకు షకీలా రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తోంది. గడిచిన రెండు.. మూడు బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే.. ఈసారి పేరున్నవారు ఎక్కువనే చెప్పాలి

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:10 AM GMT
2 వారాలకు షకీలా రెమ్యునరేషన్ ఎంతంటే?
X

బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తోంది. గడిచిన రెండు.. మూడు బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే.. ఈసారి పేరున్నవారు ఎక్కువనే చెప్పాలి. బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందంటే అందరూ ఒప్పుకోరు. కొందరు పేరు కోసం.. మరికొందరు డబ్బుల కోసం.. ఇంకొందరు అందరికి తమను తెలుసుకునేందుకు దీన్నో మాథ్యమంగా ఉపయోగించుకుంటారు. అయితే.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరు ప్రముఖులకు ఉన్న ఇమేజ్ పోగొట్టుకోవటం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయటమంటే.. దాన్నో సాహసంగానే చెప్పాలి.

ఇప్పటివరకున్న ఇమేజ్ పోతే.. దానితో జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి సీజన్ లో సీనియర్ నటి.. ఒకప్పుడు శృంగార తారగా తన సినిమాలతో పెద్ద హీరోలకు సైతం చెమటలు పట్టించిన ఆమె.. ఈ రియాల్టీ షోలో ఎలా వ్యవహరిస్తారన్న సందేహం ఉంది. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా ఆమె వ్యవహార శైలి ఉండటం తెలిసిందే. ఈ షోతో తన మీద చాలామందికి ఉండే ఇమేజ్ ను మార్చగలిగింది.

షకీలా అన్నంతనే శృంగార తార అని గుర్తుకు వచ్చే స్థానే.. బిగ్ బాస్ ఇంట్లో అమ్మగా మారింది. పద్దతిగా రెడీ కావటం.. అందరితో కలుపుగోలుగా మాట్లాడటం.. అందరి తలలో నాలుకలా మెలుగుతూ.. కుటుంబ పెద్ద పాత్రను పోషించిన ఆమె.. రెండో వారంలోనూ ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ వేళలో.. హౌస్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకోవటం.. తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం తెలిసిందే. తేజ అయితే.. షకీలా తనకు అమ్మలా అనిపించారన్నారు. దామిని.. పెదవే పలికిన మాటల్లోనే అంటూ పాట పాడింది. తన ఎగ్జిట్ వేళ.. అందరిని ఏడిపించేసిన షకీలా ఎలిమినేషన్ చూసినప్పుడు.. ఆమె మరికొంత కాలం హౌస్ లో ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో కలిగింది.

మిగిలిన సందర్భాల సంగతి ఎలా ఉన్నా.. నామినేషన్స్ అంటేనే భయపడిపోయే షకీలాకు రెండో వారం తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మరి.. ఈ రెండు వారాలకు షకీలా అందుకున్న మొత్తం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. వారానికి ఆమెకు అందిన పారితోషికం రూ.3.75 లక్షలుగా చెబుతున్నారు. అంటే.. రెండు వారాలకు రూ.7 లక్షలకుపైనే ఉంది. ఇంత భారీగా పారితోషికం అందుకున్న అతి కొద్దిమందిలో షకీలా ఒకరన్న మాట వినిపిస్తోంది.