Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ స్పై ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

బిగ్ బాస్ సీజన్ 7 లో స్పై బ్యాచ్ గా ఏర్పడిన శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ముగ్గురు కలిసి ఆటని ఆడారు

By:  Tupaki Desk   |   28 Dec 2023 11:00 AM GMT
బిగ్ బాస్ స్పై ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో స్పై బ్యాచ్ గా ఏర్పడిన శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ముగ్గురు కలిసి ఆటని ఆడారు. ఒక పక్క స్టార్ మా బ్యాచ్ కి ధీటుగా స్పై బ్యాచ్ సత్తా చాటుతూ వచ్చింది. స్పై బ్యాచ్ లో ఉన్న ముగ్గురు కూడా టాప్ 5 లో నిలిచారు. అఫ్కోర్స్ అదే బ్యాచ్ లోని పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ముగిసాక కూడా స్పై బ్యాచ్ హంగామా చేస్తుంది. పల్లవి ప్రశాంత్ విడుదల అనంతరం ముగ్గురు కలిసి ఇన్ స్టా లైవ్ ఇచ్చారు.

స్పై బ్యాచ్ కి బయట వచ్చిన క్రేజ్ కి వారంతా సూపర్ ఖుషిగా ఉన్నారు. ఈ క్రమంలో శివాజీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పై బ్యాచ్ ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నామని వెల్లడించారు. బిగ్ బాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేలా స్పై బ్యాచ్ ప్రయత్నిస్తుంది. సీజన్ 7 తో సూపర్ పాపులర్ అయిన శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారట. ఈ సినిమా కథ ఆల్రెడీ సిద్ధమైందని.. త్వరలోనే డైరెక్టర్ ఎవరన్నది అనౌన్స్ చేస్తామని అన్నారు శివాజీ.

గంటన్నర నిడివితో ఇండిపెండెంట్ మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుందని అన్నారు. 20 ఏళ్లుగా శివాజీ 90కి పైగా సినిమాలు చేశారు. కేవలం హీరోగానే కాదు నిర్మాతగా దర్శకుడి గా కూడా శివాజీ ప్రయత్నాలు చేశారు. కొంతకాలంగా కెరీర్ లో వెనుకబడ్డ శివాజీ బిగ్ బాస్ తో మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే షో లో 105 రోజల పాటు తన ఆటతో మెప్పించారు. శివాజీ మైండ్ గేమ్ తో మిగతా హౌస్ మేట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చారు.

బిగ్ బాస్ షోతో పాపులారిటి తెచ్చుకున్న వారు ఎవరైనా సరే ఆ క్రేజ్ తో వచ్ఛీ రాగానే ఏదో ఒక ప్రాజెక్టు చేయాలని అనుకుంటారు. కాని వారు అనుకున్నట్టుగా ఏది జరగదు. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు బిగ్ బాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నా ఆశించిన రేంజ్ లో ఫలితాలు అందుకోలేదు. సీజన్ 4 నుంచి సోహైల్, సీజన్ 5 విన్నర్ సన్నీ పర్వాలేదు అనిపించినా అంతకుముందు విన్నర్.. ఆ తర్వాత విజేతలు కనిపించకుండా పోయారు. బిగ్ బాస్ 7 తో క్రేజ్ తెచ్చుకున్న స్పై బ్యాచ్ ఆ ఇమేజ్ ని తమ కెరీర్ కి ప్లస్ అయ్యే ప్లానింగ్ లో ఉన్నారు. మరి వీరి ప్లానింగ్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.