Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : రెండు వారాల ఓటింగ్.. టైటిల్ ఛాన్స్ ఎవరికి..?

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా రెండు వారాలు టైటిల్ ఓటింగ్ అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:13 AM GMT
బిగ్ బాస్ 7 : రెండు వారాల ఓటింగ్.. టైటిల్ ఛాన్స్ ఎవరికి..?
X

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా రెండు వారాలు టైటిల్ ఓటింగ్ అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇదివరకు జరిగిన ఆరు సీజన్లలో కేవలం లాస్ట్ వీక్ మాత్రమే టైటిల్ ఎవరికి ఇవ్వాలన్నది ఓటింగ్ చేస్తారు. కానీ ఈసారి కొత్తగా రెండు వారాలు ఓటింగ్ కి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఫైనల్ పాస్ గెలుచుకుని ఫైనల్ వీక్ కి వెళ్లాడు అర్జున్. ఇక మిగిలిన నలుగురు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

రెండు వారాల ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్నది చూస్తే. ఇప్పటికే టాప్ 3 లో ఉన్న వారికి పోటీగా చివర ఇద్దరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి టాప్ 3 గా పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ ఉన్నారు. శివాజి విన్నర్ కావడానికి కూడా ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. రెండు వారాల ఓటింగ్ అవకాశం ఇస్తున్నారు కాబట్టి బుల్లితెర ఆడియన్స్ ఏమైనా అమర్ ని గెలిపించాలని ఓట్స్ వేస్తే అతను కూడా టైటిల్ రేసులో ఉండే అవకాశం ఉంది.

ఏది ఏమైనా శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ వీరి ముగ్గురిలోనే టైటిల్ విన్నర్ ఉంటారని తెలుస్తుండగా రెండు వారాల ఓటింగ్ వల్ల అర్జున్ ఇంకా మరో టాప్ 5 కంటెస్టెంట్ కి టైటిల్ కి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 7 ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యింది. మరో రెండు వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్ చివరి నామినేషన్ ప్రక్రియ సోమవారం జరిగింది. ఈ క్రమంలో నామినేషన్స్ లో అర్జున్ తప్ప మిగతా హౌస్ మెట్స్ అంతా ఉన్నారు.

వారిలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు. ఎవరు టాప్ 5 లో నిలుస్తారన్నది చూడాలి. అర్జున్ తో పాటుగా టాప్ 5లో శివాజి, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ కన్ ఫర్మ్ కాగా యావర్, ప్రియాంక, శోభా శెట్టిలలో ఒకరికి ఆ ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ భారీగా ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఓటింగ్ రెండు వారాలు ఉంచడం పట్ల మరో వెర్షన్ ఏంటంటే కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో ఉన్నాడు. శివాజి కన్నా అతనికే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. రెండు వారాల్లో అతన్ని దాటేలా ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. అందుకే బిగ్ బాస్ టీం ఇలా ప్లాన్ చేసిందని కొందరు అంటున్నారు.