Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : యావర్ ఏడిపించేశాడు.. శుభ విషయంలో గౌతమ్ చేసింది కరెక్టేనా..?

అతను ఇంటి నుంచి లెటర్ కి కాదు కానీ ఆటలో అదే కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్ గా ఉండటం కోసం ఆమెను కన్విన్స్ చేయడం విచిత్రంగా అనిపించింది

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:24 AM GMT
బిగ్ బాస్ 7 : యావర్ ఏడిపించేశాడు.. శుభ విషయంలో గౌతమ్ చేసింది కరెక్టేనా..?
X

బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారం ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. జరిగిన నాలుగు వారాలు కూడా పవర్ అస్త్ర అంటూ కంటెస్టెంట్స్ ని ఆట ఆడించిన బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ దాని వల్ల వచ్చే సూపర్ ఇమ్యూనిటీ పవర్ ని కంటెస్టెంట్స్ గెలుచుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎవరు తన బడ్డీ అంటే స్నేహితులుగా అనుకుంటున్నారో వారితో జత కట్టి ఉండాల్సి ఉంటుంది. ఆల్రెడీ బుధ, గురు వారాల ఎపిసోడ్ లోనే ఈ టాస్క్ కొనసాగించగా గెలిచిన బడ్డీ జోడీకి స్టార్స్ ఇస్తూ వచ్చారు. ఈ టాస్క్ లో శివాజి పల్లవి ప్రశాంత్ జోడీ ఎక్కువ స్టార్స్ గెలిచింది.

అయితే ఈ టాస్క్ లో శోభా, ప్రియాంక జోడీ తప్ప అందరు కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్లారు. అయితే కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే ఇంటి నుంచి వచ్చిన తమ లెటర్ ని చదివేలా అవతల వారిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. నిన్న కేవలం గౌతం శుభ శ్రీ, యావర్ తేజ ల జోడీలు లెటర్ టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో గౌతం శుభ శ్రీని కన్విన్స్ చేసి తను లెటర్ కోసం కాదు కెప్టెన్సీ కంటెండర్ అవ్వడం కోసం అంటూ ఆమెను కన్విన్స్ చేశాడు.

అతను ఇంటి నుంచి లెటర్ కి కాదు కానీ ఆటలో అదే కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్ గా ఉండటం కోసం ఆమెను కన్విన్స్ చేయడం విచిత్రంగా అనిపించింది. అంతేకాదు తాను కచ్చితంగా కెప్టెన్సీ టాస్క్ లో టఫ్ ఫైట్ ఇచ్చి తను గెలిచి అది ఎలాంటి పవర్ అయినా నీ కోసమే వాడుతా అంటూ శుభ శ్రీకి మాట ఇచ్చాడు. దానికి ఆమె ఓకే చెప్పి తన ఇంటి నుంచి అక్క రాసిన లెటర్ ని షట్టర్ లో వేసి ముక్కలయ్యేలా చేసింది.

గౌతం వాళ్ల అమ్మ రాసిన లెటర్ చదివి ఎమోషనల్ అయ్యాడు. ఇక యావర్ తేజ లు యాక్టివిటీ ఏరియాకి వచ్చారు. యావర్ నువ్వు లెటర్ చదివి కెప్టెన్సీ కంటెండర్ అవ్వు రెండు సార్లు చివరి దాకా వెళ్లావు కదా అని తేజ చెప్పాడు. నాకు పెద్దగా ఎమోషన్స్ ఉండవు. నీకు ఈ టైం లో మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ చాలా అవసరం అని తేజ అంటాడు. కానీ యావర్ మాత్రం తాను అవతల వారిని బాధ పెట్టి నేను సంతోషపడను అంటూ తన లెటర్ ని షటర్ లో వేసి తేజ లెటర్ ఉంచుతాడు.

యావర్ తన లెటర్ షట్టర్ లో వేసిన తర్వాత చాలా బాధ పడతాడు. అఫ్కోర్స్ ఆ టైం లో ఆడియన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాత తేజ లెటర్ చదువుతూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం ఆడియన్స్ ని కదిలించింది. నెల రోజుల పైగా ఇంటిని వదిలి వెళ్లారు కాబట్టి ఒక్కసారి ఇంట్లో వాళ్ల నుంచి వచ్చిన లెటర్ కచ్చితంగా చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. తేజ లెటర్ చదువుతున్న టైం లో అతను కన్నీళ్లు పెట్టడం ఆడియన్స్ ని టచ్ చేసింది. నిన్న ఎపిసోడ్ అంతా ఇదే జరిగింది. ఈరోజు మిగతా జోడీలు ఈ టాస్క్ చేయనున్నారు.