Begin typing your search above and press return to search.

ఏంటి బిగ్ బాస్ లో హీరో కూడానా?

ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయ వేదికలపై శివాజీ కనిపిస్తున్నాడు. ఇంటర్వ్యూలలో మాత్రమే కనిపిస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:39 AM GMT
ఏంటి బిగ్ బాస్ లో హీరో కూడానా?
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కంటిస్టెంట్ ల ఎంపిక దాదాపు ఖరారైపోయింది. సినీ, సీరియల్ ఆర్టిస్ట్స్ తో పాటుగా యుట్యూబ్ సెలబ్రెటీలని కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు. గత సీజన్ ఫెయిల్యూర్ ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి మాత్రం మొత్తం గేమ్ విధానం మారుస్తున్నట్లు ఇప్పటికే ప్రోమోలతో క్లారిటీ ఇచ్చారు.

ఇక కొద్ది రోజులుగా హౌస్ లోకి వెళ్లబోయే వారు వీళ్ళే అంటూ చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కొంతమంది యుట్యూబర్స్ ఈ బజ్ ని బాగా యూజ్ చేసుకొని యుట్యూబ్ వీడియోలు కూడా చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదని కొంతమంది క్లారిటీ ఇచ్చారు. ఇక షో టైం దగ్గర పడుతున్నకొద్ది కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఇప్పుడు ఇంటరెస్టింగ్ గా ఒకప్పటి హీరో శివాజీ పేరు కూడా రావడం విశేషం.

ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయ వేదికలపై శివాజీ కనిపిస్తున్నాడు. ఇంటర్వ్యూలలో మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా సినిమా పరంగా కంటే రాజకీయపరమైన టాక్స్ లోనే శివాజీ ట్రెండ్ అవుతున్నారు. ఇప్పుడు శివాజీని హౌస్ లోకి తీసుకురావాలనే ప్రయత్నం ఫలించిందనే టాక్ వినిపిస్తోంది. అతను కంటిస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లడం ఖాయం అనే మాట జోరుగా వినిపిస్తోంది.

శివాజీ మాత్రమే కాకుండా ఒకప్పటి సాఫ్ట్ అడల్ట్ మూవీస్ తో స్టార్ గా ఎదిగిన షకీలా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే మాట వినిపిస్తోంది. అలాగే పాత హీరోయిన్ కిరణ్ రాథోడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరో యాక్టర్, కొరియోగ్రాఫర్ ఫర్జానా కూడా ఈ జాబితాలో ఉంది. అయితే వీరిలో ఎవరు హౌస్ లోకి వెళ్తారనేదానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

కానీ ఒకప్పుడు స్టార్స్ గా ఉన్న వీరందరూ బిగ్ బాస్ లోకి అడుగుపెడితే మాత్రం కచ్చితంగా ఈ సీజన్ ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న వారిలో ఎవరు ఫైనల్ అనేది తెలియాలంటే బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.