Begin typing your search above and press return to search.

షకీలా 'అతి' మాట అతకలేదు.. మరీ అలా అనేయటమా?

బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. షో మొదలైప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు

By:  Tupaki Desk   |   6 Sep 2023 8:36 AM GMT
షకీలా అతి మాట అతకలేదు.. మరీ అలా అనేయటమా?
X

బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. షో మొదలైప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు.. కంటెస్టెంట్ల మధ్య రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో కొంతమంది మధ్య గడుపుతూ.. అందరిలోకి తానే ముందుండాలి? తమను చూసే ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవాలన్న తపనతో మొదలయ్యే ఆరాటానికి తోడుగా.. బిగ్ బాస్ ఇచ్చే సీక్రెట్ టాస్కులతో మొదలయ్యే అపార్థాలు.. ఆగ్రహావేశాలు ఆ తర్వాత కంటిన్యూ అవుతుంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్తవారితో మాట్లాడే క్రమంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడే మాటలతో ఎదురయ్యే తలనొప్పులు ఎక్కువే.

మితంగా మాట్లాడుతూ.. మనసుల్ని దోచుకోవటం అంత ఈజీ టాస్కు కాదు. అందునా బిగ్ బాస్ హౌస్ లో. ఆచితూచి మాట్లాడటం.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అందరి చేత ఓకే అనిపించుకోవటానికి నానా పాట్లు పడుతుంటారు. అయితే.. కొందరు మాత్రం తమకు తోచినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా మొదలైన సీజన్ లో ప్రముఖ నటి షకీలా నోటి నుంచి వచ్చిన మాటకు ఆశ్చర్యపోయే పరిస్థితి.

మరీ.. ఇలా మాట్లాడేస్తారా? అన్న పరిస్థితి. నామినేషన్ వేళ.. షకీలాను నామినేట్ చేశాడు ప్రిన్స్ యూవర్. ఎందుకలా? అన్న దానికి తాను బదులిస్తూ.. షకీలా తన పేరుతో పాటు తన తండ్రిని ఉద్దేశించిన కామెంట్ తనకు నచ్చలేదన్నారు. 'నీ పేరు ప్రిన్స్ అయితే.. మీ నాన్న పేరు కింగా?' అంటూ చేసిన వ్యాఖ్యకు తాను హర్ట్ అయినట్లుగా పేర్కొన్నారు. పెద్దగా పరిచయం లేని కొత్త వ్యక్తులతో ఇలా మాట్లాడేయటం ఏం పద్దతి? అన్నది షకీలాకు ఎదురవుతున్న ప్రశ్న.

ప్రిన్స్ తనను నామినేట్ చేసిన నేపథ్యంలో తాను కూడా ప్రిన్స్ ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. తాను అన్న మాటకు.. అప్పుడే అభ్యంతరం చెప్పేయకుండా.. అప్పుడు మామూలుగా ఉండి ఇప్పుడు హర్ట్ అయినట్లుగా చెప్పటం నచ్చలేదని.. అందుకే అతన్ని తాను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. ప్రిన్స్ తండ్రిని ఉద్దేశించి షకీలా నోటి నుంచి వచ్చిన మాట బాగోలేదన్న భావన పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టంగ్ స్లిప్ అయి.. ఏదో అదాటుగా అనేసి ఉంటే.. అప్పుడే సారీ చెప్పాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక.. ప్రిన్స్ ను నామినేట్ చేసిన సందర్భంలో ఆమె చెప్పిన కారణం అతికినట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా షకీలా మాట అవాక్కు అయ్యేలా చేస్తుంది.