Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : నాగ్ సార్ మీరు సూపర్ అంతే..!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు వీకెండ్ వచ్చింది అంటే ఆడియన్స్ కి పండుగ అన్నట్టే.

By:  Tupaki Desk   |   1 Oct 2023 7:21 AM GMT
బిగ్ బాస్ 7 : నాగ్ సార్ మీరు సూపర్ అంతే..!
X

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు వీకెండ్ వచ్చింది అంటే ఆడియన్స్ కి పండుగ అన్నట్టే. వీక్ డేస్ మొత్తం టాస్క్ లు గొడవలతో సాగే బిగ్ బాస్ వీకెండ్ నాగార్జున రివ్యూ కోసం ఎదురుచూస్తారు. కంటెస్టెంట్ తో పాటుగా ఆడియన్స్ కూడా వారం పాటు జరిగిన విషయాల మీద నాగార్జున ఎలా రెస్పాండ్ అవుతారన్నది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకు తగినట్టుగానే నాగార్జున ఎపిసోడ్ ఉంటుంది. ముందు సీజన్లలో అయినా కొన్నిసార్లు నాగార్జున హోస్టింగ్ ని కూడా ఆడియన్స్ తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఈ సీజన్ అలా లేదు. ఎవరికీ ఎక్కడ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా నాగార్జున అదరగొట్టేస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో ఈ వారం జరిగిన విషయాల మీద మాట్లాడిన నాగార్జున పవర్ అస్త్ర కంటెండర్ టాస్క్ లో తేజ గౌతం కృష్ణ మీద బెల్ట్ తో మెడ మీద లాగడం గురించి క్లాస్ పీకాడు. తేజ మీద సీరియస్ అయిన నాగార్జున ఇలాంటిది ఇంకోసారి రిపీట్ చేయొద్దని అన్నారు. అంతేకాదు ఆ టైం లో సంచాలకులుగా చేస్తున్న శివాజి, సందీప్ ల మీద ఫైర్ అయ్యారు నాగార్జున.

శుభ శ్రీ శివాజి విషయంలో ఫీలైన విషయాన్ని ప్రస్తావించిన నాగార్జున ఆ వీడియో చూపించి శివాజి ఉద్దేశం ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు. ఒక్క రతిక తప్ప శివాజికి ఈ విషయంలో హౌస్ మెట్స్ సపోర్ట్ చేశారు. ఇక మరోపక్క నామినేషన్స్ టైం లో గౌతం కృష్ణ పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్స్ పై కూడా వీడియో చూపించి క్లారిటీ ఇచ్చారు. గౌతం కృష్ణ టాస్క్ ల విషయంలో శివాజి మీద బయాస్డ్ గా ఉన్నారన్న విషయం సందీప్ కి చెప్పడం కూడా వీడియోలో చూపించారు.

పల్లవి ప్రశాంత్ టాస్క్ లో ఉన్నప్పుడు అతని దృష్టి మళ్లించడానికి అతన్ని కావాలని టార్గెట్ చేసిన రతిక, అమర్ దీప్ లకు కూడా నాగార్జున క్లాస్ పీకారు. శనివారం ఎపిసోడ్ అంతా కూడా హాట్ హాట్ గా సాగింది. ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా శనివారం ఎపిసోడ్ లో ఒక్కరిని కూడా సేఫ్ చేయలేదు నాగార్జున. సండే రోజే ఎవరు సేఫ్ ఎవరు ఎలిమినేట్ అన్నది తెలుస్తుంది. మొత్తానికి ఈ సీజన్ లో నాగార్జున మొదటిసారి కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ ఆడియన్స్ కూడా శనివారం ఎపిసోడ్ ని బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.