Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఓటీటీ 2.. ఎవరు ఆసక్తి చూపట్లేదా..?

ఈసారి కూడా అదే ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ సీజన్ 7 లో క్రేజ్ తెచ్చుకున్న కొందరికి ఓటీటీ సీజన్ లో కూడా ఛాన్స్ ఇస్తున్నారట.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:30 AM GMT
బిగ్ బాస్ ఓటీటీ 2.. ఎవరు ఆసక్తి చూపట్లేదా..?
X

బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో ఈసారి బిగ్ బాస్ నాన్ స్టప్ అదే ఓటీటీ సెకండ్ సీజన్ కూడా మొదలు పెట్టాలని ప్రాయ్త్నాలు చేశారు బిగ్ బాస్ టీం. సీజన్ 7 జరిగిన బిగ్ బాస్ హౌస్ ని రెనోవేట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ అంతగా ఆకట్టుకోలేదు. ఆ టైం లో బిగ్ బాస్ అంటే కేవలం టీవీల్లోనే చూడాలనే ఆలోచనతో ఉన్నారు ఆడియన్స్. అయితే తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 ని డిస్నీ హాట్ స్టార్ లో కూడా లైవ్ ఇవ్వడంతో ఆడియన్స్ ఓటీటీలో చూడటం అలవాటు పడ్డారు.

బిగ్ బాస్ సీజన్ 7 ని టీవీల్లో చూసిన వారికన్నా డిస్నీ హాట్ స్టార్ లో చూసిన వారి సంఖ్య ఎక్కువని టాక్. అందుకే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే బిగ్ బాస్ టీం ఎంత ప్రయత్నిస్తున్నా ఓటీటీ సీజన్ అనే సరికి కంటెస్టెంట్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ కి వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ ని తీసుకున్నారు.

ఈసారి కూడా అదే ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ సీజన్ 7 లో క్రేజ్ తెచ్చుకున్న కొందరికి ఓటీటీ సీజన్ లో కూడా ఛాన్స్ ఇస్తున్నారట. అందులో యావర్ ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. అంతేకాదు లాస్ట్ సీజన్ లో వైల్డ్ కార్డ్ లో వచ్చిన నయని పావని కూడా ఓటీటీ సెకండ్ సీజన్ లో ఉంటుందని తెలుస్తుంది. వీరిద్దరితో పాటు భోలే శావలి కి ఛాన్స్ ఉందని అంటున్నారు.

వీళు ఎలాగు బిగ్ బాస్ సీజన్ 7 లో వచ్చారు కాబట్టి ఓటీటీ అయినా ఓకే అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ కి కొత్తగా వచ్చే కంటెస్టెంట్స్ ఓటీటీ సీజన్ కి మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా సరే ఇంట్రెస్ట్ చూపించట్లేదట. ఇక హోస్ట్ గా నాగార్జున కూడా కష్టమని తెలియడంతో బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ త్వరగా స్టార్ట్ చేయాలన్న ఆలోచనని విరమించుకున్నారట. అసలు ఉంటుందా లేదా అన్నది కూడా చెప్పడం కష్టమని చెప్పుకుంటున్నారు.