Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : కెప్టెన్ అయ్యింది అతనే.. హౌస్ మెట్స్ నిర్ణయమైనా ఉల్టా పుల్టానే..!

బిగ్ బాస్ సీజన్ 7 లో 11వ వారం కెప్టెన్ గా ఎవరు గెలిచారన్నది తెలిసిపోయింది. శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా డాల్స్ కి కంటెస్టెంట్స్ ఫోటోలతో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్

By:  Tupaki Desk   |   11 Nov 2023 1:30 PM GMT
బిగ్ బాస్ 7 : కెప్టెన్ అయ్యింది అతనే.. హౌస్ మెట్స్ నిర్ణయమైనా ఉల్టా పుల్టానే..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో 11వ వారం కెప్టెన్ గా ఎవరు గెలిచారన్నది తెలిసిపోయింది. శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా డాల్స్ కి కంటెస్టెంట్స్ ఫోటోలతో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో చివరి దాకా అర్జున్, శివాజి, గౌతం లు ఉన్నారు. అయితే శివాజి గౌతం ని డిస్ క్వాలిఫై చేయడంతో ఆ టైం లో వారిద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది. గౌతం అయితే కోపంతో ఊగిపోయాడు. అయితే ఫైనల్ గా కెప్టెన్ రేసులో అర్జున్, శివాజి నిలిచారు.

కెప్టెన్ ఎంపిక ఈసారి హోస్ట్ నాగార్జున తీసుకున్నారు. ఒక్కొక్కరిని కన్ ఫెషన్ రూం లోకి పిలిచి అర్జున్, శివాజి ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలన్నది వారి నిర్ణయం చెప్పమన్నారు. మెజారిటీ శివాజి కెప్టెన్ అవ్వాలని చెప్పగా అతన్నే 11వ వారం కెప్టెన్ గా ఎంపిక చేశారు. కెప్టెన్ అయితే వన్ వీక్ నామినేషన్స్ లో ఉండకపోవడంతో పాటుగా కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తాడు. అసలే గౌతం తనని ఆట నుంచి తొలగించాడని శివాజి మీద ఫైర్ మీద ఉండగా ఇప్పుడు మెజారిటీ హౌస్ మెట్స్ శివాజిని కెప్టెన్ చేశారు.

కెప్టెన్ గా శివాజి హౌస్ మెట్ గా గౌతం మధ్య ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి. ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఈ వారం అసలైతే రతిక ఎలిమినేట్ అవుతుందని భావించగా బోలే శావలి ఎలిమినేట్ అయినట్టుగా చెబుతున్నారు. హౌస్ లోకి పాట బిడ్డగా వచ్చిన బోలే శావలి తన పాటతో ఆడియన్స్ ని మెప్పించినా ఆటల్లో సరైన ప్రతిభ కనబరచలేదు.

అందుకే రతిక కన్నా తక్కువ ఓటింగ్ వచ్చిందని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ టీం రతికని కావాలనే సేఫ్ చేస్తుందని లేదంటే ఆమె రీ ఎంట్రీకి న్యాయం ఉండదని ఫీల్ అవుతున్నారని అందుకే బోలే కన్నా రతికకు తక్కువ ఓటింగ్ వచ్చినా ఆమెను సేఫ్ చేసి బోలేని ఎలిమినేట్ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా సీజన్ 7 ఉల్టా పుల్టా ఆడియన్స్ ని మాత్రం ప్రతి వారం సర్ ప్రైజ్ చేస్తూ వారి మెప్పు పొందుతుంది. ఇక ఐదు వారాలు మాత్రమే మిగిలిన ఈ సీజన్ టాప్ 5 ఎవరన్నది ఆడియన్స్ లో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఆడియన్స్ ఎవరికి వారు తాము ఇష్టపడే కంటెస్టెంట్ ని టాప్ 5 లో ఉంచే ప్లానింగ్ లో ఉన్నారు.