Begin typing your search above and press return to search.

బిగ్ బాస్​ విన్నర్ నిశ్చితార్థం.. కాబోయే భార్యను చూశారా

సీరియల్ యాక్టర్​, బిగ్​బాస్​ ఫేమ్​ మానస్.. బుల్లితెర ప్రేక్షకులు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:44 PM GMT
బిగ్ బాస్​ విన్నర్ నిశ్చితార్థం.. కాబోయే భార్యను చూశారా
X

సీరియల్ యాక్టర్​, బిగ్​బాస్​ ఫేమ్​ మానస్.. బుల్లితెర ప్రేక్షకులు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అతడు గ్రాండ్​గా నిశ్చితార్థం జరుపుకున్నాడు. శ్రీజ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఈ మేరకు కాబోయే నూతన వధూవరులు పూల దండలు మార్చుకున్నారు.

ఈ ఎంగేజ్​మెంట్​ ఈవెంట్​లో మానస్​.. లైట్ పింక్ కలర్ డ్రెస్సుల్లో శ్రీజ-మానస్ ఎంతో చూడముచ్చటగా మెరిసిపోతూ కనిపించారు. హైదరాబాద్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో ఈ వేడుక ఘనంగా జరిగినట్లు అర్థమవుతోంది. అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు టీవీ నటీనటులు కూడా హాజరై సందడి చేశారు. తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

వీటికి సంబంధించిన ఫొటోలను మానస్ పోస్ట్​ చేశారు. సోషల్ మీడియాలో కాబోయే భార్యతో కలిసి వెడ్డింగ్ రింగ్ పట్టుకుని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఎంగేజ్డ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్​మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. దండలు మార్చుకున్న ఫొటోలు, గెస్ట్​లతో సెల్ఫీలు ఇంకా పలు పిక్స్​ షికార్లు కొడుతున్నాయి.

దీంతో పలువురు టీవీ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తున్నారు. మానస్, శ్రీజ జంట చూడ ముచ్చటగా ఎంతో బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే మానస్- శ్రీజది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే ప్రస్తుతానికైతే స్పష్టతలేదు. మానస్ కు చేసుకోబోయే అమ్మాయి శ్రీజ గురించి కూడా వివరాలేవీ బయటకు రాలేదు. శ్రీజ తండ్రి హైదరాబాద్​లో సెటిల్ అయినా ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ప్రస్తుతం నెటిజన్లు మాత్రం ఆమె ఎవరు అని వెతికే పనిలో బిజీగా ఉన్నారు నెటిజన్లు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు.