Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఎవరి ఆట వారిదే.. కానీ..!

బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో వారం ఆట రసవత్తరంగా సాగుతుంది. నాలుగో పవర్ అస్త్ర మరియు హౌస్ మెట్స్ అయ్యేందుకు మిగతా కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:55 PM GMT
బిగ్ బాస్ 7 : ఎవరి ఆట వారిదే.. కానీ..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో వారం ఆట రసవత్తరంగా సాగుతుంది. నాలుగో పవర్ అస్త్ర మరియు హౌస్ మెట్స్ అయ్యేందుకు మిగతా కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే హౌస్ మెట్స్ గా కన్ఫర్మ్ అయిన శివాజి, సందీప్, శోభా శెట్టిలకు బ్యాంక్ హెడ్స్ గా ఉంచి వారి ఇచ్చే లోన్ ద్వారా మిగతా కంటెస్టెంట్స్ కి పవర్ అస్త్ర కంటెండర్స్ గా నిలిచే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో మొదటి టాస్క్ లో అమర్ దీప్ తన జోడీగా ఎంచుకున్న గౌతం కృష్ణ గెలిచారు. సెకండ్ టాస్క్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లు గెలిచారు.

వీరే కాకుండా మిగతా కంటెస్టెంట్స్ నుంచి కూడా పవర్ అస్త్ర పొందే కంటెండర్ గా నిలిచేందుకు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. విచిత్ర వస్త్రధారణతో ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. వారిలో ఎవరు కంటెండర్ గా నిలుస్తారు అన్నది చూడాలి. ఈ వారం పవర్ అస్త్ర గెలిచేందుకు యావర్, పల్లవి ప్రశాంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అమర్ దీప్, తేజ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరి ఆట వారిది అన్నట్టుగా టాస్కుల్లో టాలెంట్ చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే హౌస్ మేట్స్ అయిన శివాజి ప్రతిసారి యావర్, పల్లవి ప్రశాంత్ లకు లీడ్స్ ఇస్తూ వారికి సపోర్ట్ గా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు. సందీప్ ఓ పక్క అమర్ దీప్ కి సపోర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. హౌస్ లో ఎవరికి వారు తమ స్ట్రాటజీస్ తో ఆడుతున్నారు. యావర్ కి శివాజి సపోర్ట్ దొరకడం వల్ల అతను ఆటలో బాగా షైన్ అయ్యాడు. గత రెండు వారాలుగా యావర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నా కూడా అతను కచ్చితంగా సేఫ్ అవుతాడని చెప్పొచ్చు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో శుభ శ్రీ, గౌతం కృష్ణ, ప్రియాంక, యావర్, రతిక, తేజా ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో ఓటింగ్ లో లీస్ట్ గా రతిక, శుభ శ్రీలు ఉన్నట్టు తెలుస్తుంది. తేజా కూడా వీరితో పాటుగా లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడని చెబుతున్నారు. సో ఈ వారం ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు రాక తప్పదని చెప్పొచ్చు.