Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : శివాజికి రివర్స్ అయిన కంటెస్టెంట్..!

శివాజిని తను అన్నగా భావిస్తే అతను నాగార్జున సర్ దగ్గర నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడని చెప్పింది రతిక.

By:  Tupaki Desk   |   26 Sep 2023 10:25 AM GMT
బిగ్ బాస్ 7 : శివాజికి రివర్స్ అయిన కంటెస్టెంట్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో మండే ఎపిసోడ్ హీటెక్కించేసింది. ఓ పక్క సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవగా దానికి ముందే శివాజితో రతిక నాగార్జున సార్ ముందు మీరు నా క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పారని అడిగింది. దానికి శివాజి సారీ అని చెప్పినా సరే అలానే రతిక అతనితో మాట్లాడుతూ డిస్కషన్ కొనసాగించింది. శివాజి కి కూడా విసుగు వచ్చి దీన్ని ఇంతకన్నా సాగదీయకు నువ్వు కంటెంట్ ఇస్తున్నావ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయం గురించి రతిక అమర్ దీప్ తో కూడా డిస్కస్ చేసింది.

తను క్లోజ్ అవ్వాలని అనుకుంటే పల్లవి ప్రశాంత్ ఒక్కడే హౌస్ లో ఉన్నాడా మిగతా వారు కూడా ఉన్నారు కదా అని అన్నది రతిక. శివాజిని తను అన్నగా భావిస్తే అతను నాగార్జున సర్ దగ్గర నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడని చెప్పింది రతిక.

అసలు ఆయన మనిషేనా అంటూ శివాజి మీద కోపాన్ని ప్రదర్శించింది రతిక. అయితే శివాజి మాత్రం రతిక విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. బిడ్డ బిడ్డ అంటూ తన క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని చూశారని రతిక శివాజి మీద అసంతృప్తిగా ఉంది.

మరో పక్క యావర్ నామినేషన్స్ లో మళ్లీ ఫైర్ అయ్యాడు. గౌతం కృష్ణతో మళ్లీ గొడవ పడ్డాడు. అయితే ఆల్రెడీ హౌస్ మెట్స్ గా పవర్ అస్త్ర ఉన్న శివాజి, సందీప్, శోభా శెట్టిలకు బిగ్ బాస్ ఈ నామినేషన్స్ లో ఒక టాస్క్ ఇచ్చాడు. వాళ్లని జడ్జిలుగా పెట్టి నామినేషన్స్ ప్రక్రియలో ఎవరినైతే చేయాలని అనుకుంటున్నారో వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఆట జరిగినంత వరకు రతిక, ప్రియాంకలు నామినేట్ అయ్యారు.

నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈసారి నామినేషన్స్ చాలా టఫ్ గానే జరిగేలా ఉన్నాయి. అంతేకాదు వారాలు గడుస్తున్నా కొద్దీ ఆట కూడా చాలా టఫ్ గా మారుతుంది. ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెన్స్ మాత్రమే ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని అంటున్నా ఇంతవరకు దానికి సంబందించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ వారం కచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని చెప్పొచ్చు. ఏమో ఉల్టా పుల్టా అని ఇద్దరిని ఎలిమినేట్ చేసినా అశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆడియన్స్ అనుకుంటున్నారు.