Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : టైటిల్ రేసులో ఆ ముగ్గురే ఎందుకు..?

అందులో ఒకరు సీరియల్ యాక్టర్ అమర్ కాగా మరొకరు ఒకప్పటి హీరో శివాజి, మూడో వ్యక్తి కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్.

By:  Tupaki Desk   |   28 Nov 2023 9:30 AM GMT
బిగ్ బాస్ 7 : టైటిల్ రేసులో ఆ ముగ్గురే ఎందుకు..?
X

బిగ్ బాస్ సీజన్ 7 మరో 3 వారాల్లో ముగుస్తుంది. సీజన్ 6 డిజాస్టర్ అవ్వడంతో సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ మొదటి నుంచి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ వచ్చారు. హోస్ట్ నాగార్జున కూడా ఇదివరకులా స్క్రిప్ట్ ఇస్తే చదవడం అన్నట్టు కాకుండా తను కూడా ఎపిసోడ్స్ చేస్తున్నట్టు అనిపించారు. హోస్ట్ గా నాగార్జున ఈ సీజన్ అదరగొట్టేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 3 వారాల్లో టైటిల్ ఎవరు ఎత్తుతారు అన్నది తెలుస్తుంది.

ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది హౌస్ మెట్స్ ఉన్నారు. వీరిలో ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. టాప్ 5 లో ఎవరు విజేత అవుతారన్నది తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న బజ్ ని బట్టి చూస్తే టైటిల్ రేసులో ముగ్గురు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకరు సీరియల్ యాక్టర్ అమర్ కాగా మరొకరు ఒకప్పటి హీరో శివాజి, మూడో వ్యక్తి కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ కు వెళ్లడమే తన లక్ష్యంగా పెట్టుకుని పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ వీడియోలు చేయగా అతన్ని హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరిలో తీసుకొచ్చారు. మొదట్లో రెండు మూడు వారాల కన్నా కష్టమే అనిపించిన ప్రశాంత్ శివాజి సపోర్ట్ తో అదరగొట్టేశాడు. హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. టైటిల్ రేసులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాడు పల్లవి ప్రశాంత్.

ఇక సీరియల్ హీరో అమర్ దీప్ మొదట్లో కాస్త అతి చేసినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక తన ఆట తీరు మార్చుకున్నాడు. లాస్ట్ 2, 3 వారాలు అతని ఆట అదరగొట్టేస్తుంది. కెప్టెన్ అవ్వలేదన్న కసితో టైటిల్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అమర్ కూడా టాప్ 2, 3 స్థానాల్లో ఉన్నాడు.

ఇక మొన్నటిదాకా శివాజిదే ఈ సీజన్ టైటిల్ అనే టాక్ ఉండగా అమర్ ని కెప్టెన్ కానివ్వకుండా చేయడంతో ఆయన 3వ స్థానానికి పడిపోయాడు. సో ప్రస్తుతానికి శివాజి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. మధ్యలో ఎవరు ఏ స్థానానికైనా వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే టైటిల్ రేసులో అయితే ఈ ముగ్గురు మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయితే కామన్ మ్యాన్ గా వచ్చి సంచలనం సృష్టించినట్టు అవుతుంది.