Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ 7 : మరింత ఆసక్తి పెంచుతున్న ప్రోమో

ప్రోమోలతో సీజన్ విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.. మరి అలా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే సీజన్ ప్రారంభమయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:33 AM GMT
బిగ్‌ బాస్ 7 : మరింత ఆసక్తి పెంచుతున్న ప్రోమో
X

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 7 చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అంటూ ఇప్పటికే విడుదల అయిన ప్రోమో ద్వారా నిర్వాహకులు చెప్పారు. నాగార్జున కుడి ఎడమైతే అనే కొటేషన్ తో మొత్తం సీన్ రివర్స్ అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ప్రకటించాడు. అంతే కాకుండా ప్రతి విషయంలో కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అన్నాడు.

కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా స్పెషల్‌ గా వ్యవహరించబోతున్నారు. బిగ్ బాస్ సీజన్‌ 7 వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా వచ్చిన కొత్త ప్రోమో షో పై మరింత ఆసక్తి ని రేకెత్తిస్తోంది. మీరు అనుకున్నట్లుగా ఈ సీజన్ ఉండబోదు అంటూ కొత్త ప్రోమోతో మరోసారి నాగార్జున చెప్పే ప్రయత్నం చేశాడు.

నాగార్జున హోస్టింగ్ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ సీజన్‌ చాలా స్పెషల్‌ గా ఉండే ఉద్దేశ్యంతో నిర్వాహకులు భిన్న విభిన్నమైన టాస్క్ లు పెట్టడంతో పాటు కంటెస్టెంట్స్ కి షాక్ ల మీద షాక్ లు ఇవ్వడంతో పాటు చూసే ప్రేక్షకులకు థ్రిల్‌ ను ఇవ్వబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఒక ఓటీటీ సీజన్ తో కలిపి మొత్తం ఏడు సీజన్ ల బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులు చూశారు. అన్ని సీజన్ లు కూడా దాదాపుగా సేమ్ ఉన్నారు. కానీ ఈ సీజన్‌ మాత్రం పూర్తి విరుద్దంగా ఉండబోతుందని అనిపిస్తుంది. ప్రోమోలతో సీజన్ విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.. మరి అలా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే సీజన్ ప్రారంభమయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సింగర్ మోహన భోగరాజు, అమర్‌ దీప్‌, జబర్దస్త్‌ వర్ష, సీనియర్ నటుడు ప్రభాకర్‌ మరి కొందరు సోషల్ మీడియా సెలబ్రెటీలు, యూట్యూబర్స్‌ కి ఈసారి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా సీక్రెట్‌ గానే కంటెస్టెంట్స్ పేర్లు ఉంచుతున్నారు.