Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు.. రిస్క్ ఎవరికి..?

ఈ వారం బోలే, అశ్విని ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 11:57 AM GMT
బిగ్ బాస్ 7 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు.. రిస్క్ ఎవరికి..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో 7వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. ఈ సీజన్ లో ఎవరు ఎందుకు ఎవరిని నామినేట్ చేస్తున్నారు అన్నది అర్ధం కావట్లేదు. క్లోజ్ గా ఉండే తేజాని శోభా శెట్టి నామినేట్ చేస్తుంది. కెప్టెన్ యావర్ అమర్ దీప్ ని కేవలం స్ప్రైట్ తాగాడన్న కారణం చేత నామినేట్ చేస్తాడు. ఇలా కొన్ని సిల్లీ నామినేషన్స్ అనిపించినా కొన్ని మాత్రం ఒకరి మీద ఒకరు హీటెక్కించేలా వాగ్వివాదాలు జరిపి నామినేషన్స్ వేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 లో ఏడవ వారం నామినేషన్స్ లో భోలే శావలి, అశ్విని, టేస్టీ తేజా, అమర్ దీప్, పూజా, పల్లవి ప్రశాంత్, గౌతం కృష్ణ మొత్తం ఏడుగురు హౌస్ మెట్స్ నామినేట్ అయ్యారు. 7వ సీజన్ 7వ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉండటం విశేషం. నామినేషన్స్ లో ఉన్న వారిలో అశ్విని, బోలే శావలి, పూజాలకు రిస్క్ అని చెప్పొచ్చు. ఈ ముగ్గురు హౌస్ మెట్స్ రెండు వారాల క్రితమే హౌస్ లోకి వచ్చారు.

సో వీరి ఆట ఏంటన్నది ఇంకా ఆడియన్స్ గుర్తించలేదు. బోలే శావలి అయితే నామినేషన్స్ టైం లో భూతులు మాట్లాడాడు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి మరి అతన్ని సరి చేశాడు. ఈ వారం బోలే, అశ్విని ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. ఇక నామినేషన్స్ పూర్తి కాగానే ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఓటింగ్ లో టాప్ పర్సెంటేజ్ లుగా ఉన్నారు.

ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. జిలేబి పురం, గులాబి పురం అంటూ హౌస్ మెట్స్ ని రెండు టీం లుగా విడగొట్టి బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ టాస్క్ లల్లో ఒకసారి గులాబి పురం గెలవగా.. ఒకసారి జిలేబి పురం గెలిచింది. ఈరోజు మరో ఈ రెండు టీం లకు మరో టఫ్ టాస్క్ ఇస్తున్నారని తెలుస్తుంది. గెలిచిన టీం సభ్యులకు మళ్లీ వారిలో వారికే ఒక టాస్క్ ఇచ్చి కెప్టెన్సీ ఎంపిక జరుగుతుంది. మరి ఈ వారం కెప్టెన్సీ ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో ఈ సీజన్ ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా వస్తుంది. ఉల్టా పుల్టా అంటూ నాగార్జున కూడా సీజన్ హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు.