Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. రిస్క్ ఎవరికి అంటే..?

అమర్ కాకుండా ప్రియాంక, శోభా శెట్టి, శివాజి, పల్లవి ప్రశాంత్, గౌతం, యావర్, అర్జున్ నామినేషన్స్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 5:55 AM GMT
బిగ్ బాస్ 7 : ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. రిస్క్ ఎవరికి అంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 7 13వ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. మరో 3 వారాల్లో పూర్తి కాబోతున్న ఈ సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. చివరి వారాలు కాబట్టి అందరిని నామినేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమర్ తప్ప హౌస్ లో ఉన్న అందరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అమర్ కాకుండా ప్రియాంక, శోభా శెట్టి, శివాజి, పల్లవి ప్రశాంత్, గౌతం, యావర్, అర్జున్ నామినేషన్స్ లో ఉన్నారు.

శివాజి లాస్ట్ వీక్ అర్జున్ కి కెప్టెన్సీ ఇచ్చేందుకు అమర్ ఎంత బతిమిలాడినా ఇవ్వలేదు. అయితే తనని వాడుకుని అమర్ ని కెప్టెన్ గా చేయనందుకు అర్జున్ శివాజిని నామినేట్ చేశాడు. అర్జున్ తనని నామినేట్ చేస్తాడని ఊహించని శివాజి తిరిగి అతన్ని నామినేట్ చేశాడు. ఇక మరోపక్క అమర్ కెప్టెన్ అయ్యేందుకు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేయగా టాస్క్ లో ప్రశాంత్ సరిగా ఆడలేదని అమర్ నామినేట్ చేశాడు. అమర్ పై నమ్మకం పెట్టుకుంటే తననే నామినేట్ చేశాడని పల్లవి ప్రశాంత్ బాధ పడ్డాడు.

ఇలా నమ్మకాలు అపనమ్మకాల మధ్య ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. అమర్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల కచ్చితంగా ప్రియాంక, శోభా శెట్టిలకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. అమర్ ఫ్యాన్స్ అంతా కూడా వారిద్దరికి ఓట్స్ స్ప్లిట్ చేస్తారు. సో ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉండగా లీస్ట్ ఇద్దరిలో అర్జున్, గౌతం ఉండే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు.

అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. టాస్కుల్లో బాగానే ఆడుతున్నా ఇంకా ఓపెన్ అవ్వట్లేదన్నది హౌస్ మెట్స్ కామెంట్. అంతేకాదు లాజికల్ గా మాట్లాడటం వరకు ఓకే కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక స్టాండ్ తీసుకోకపోవడం కూడా అతన్ని వెనక్కి నెట్టేస్తుంది. గౌతం మాత్రం ఏ బ్యాచ్ తో కలవకుండా శివాజిని టార్గెట్ చేస్తూ ఆట కొనసాగిస్తున్నాడు. ఈ వారం కచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. అది గెలిస్తే మాత్రం వారు మొదటి టాప్ 5 కంటెస్టెంట్ గా ఫిక్స్ అయినట్టే. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.