Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : టాలెంట్ చూపిస్తున్న కంటెస్టెంట్స్..!

బిగ్ బాస్ 7 లో మొదటి వారం నుంచే ఎవరికి వారు కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ 7 ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది.

By:  Tupaki Desk   |   9 Sep 2023 6:16 AM GMT
బిగ్ బాస్ 7 : టాలెంట్ చూపిస్తున్న కంటెస్టెంట్స్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో అసలైన ఆట మొదలైంది. సండే ఎపిసోడ్ మొత్తం కంటెస్టెంట్స్ అంతా కూడా హౌస్ లోకి వెళ్లగా మండే నుంచి కంటెస్టెంట్స్ అంతా కూడా తమ ప్రదర్శన మొదలు పెట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన ఐదు వారాల ఇమ్యూనిటీలో భాగంగా సందీప్, ప్రియాంక ముందంజలో ఉన్నారు. ఇక బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయమని ఇచ్చిన టాస్క్ లో శివాజి, రతికలు విజేతలుగా నిలిచారు. ఈ నలుగురిలో ఇమ్యూనిటీ కోసం ఓటింగ్ నిర్వహించారు. ఈ నలుగురు కాకుండా మిగిలిన 10 మంది ఎవరికైతే ఇమ్యూనిటీ రాకూడదో వారి బకెట్ సాండ్ (ఇసుక) పోయాల్సి ఉంటుంది.

అయితే హౌస్ మెట్స్ అంతా కూడా రతిక, శివాజిల బకెట్ లో పోశారు. సో ఇమ్యూనిటీ రేసులో సందీప్, ప్రియాంకా మళ్లీ టాప్ 2 గా నిలిచారు. ఈ టాస్క్ లో భాగంగా తనకు సపోర్ట్ చేయని హౌస్ మెట్స్ మీద రతిక ఫైర్ అయ్యింది.

ఇదిలా జరుగుతుంటే శివాజి, షకీల హౌస్ మెట్స్ ని బకరా చేసేలా ఒక ఫన్నీ టాస్క్ వారి సొంతంగా ఆడారు. షకీలా కు ఏదో సమస్య ఉన్నట్టుగా ప్రవర్తించమని శివాజి సలహా ఇచ్చారు. షకీలా శివాజి ఇచ్చిన సలహాని అప్లై చేశారు.

అయితే హౌస్ లో ఉన్న డాక్టర్ గౌతం కృష్ణ షకీలాకి ఏమైంది అన్నది చూడాలని అనుకున్నారు. అయితే షకీలా తన పర్ఫార్మెన్స్ తో అతన్ని కూడా బుట్టలో వేసుకుంది. నిజంగానే ఆమెకు మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అనేశాడు. షకీలా చేసేదంతా నటన అని శివాజికి తెలుసు. జరిగిన ఆరు రోజుల ఎపిసోడ్ లో షకీలా బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చింది ఈ ఎపిసోడ్ అనే చెప్పొచ్చు.

నటిగా తనని ఒక యాంగిల్ లో చూశాం కానీ షకీలా లో ఇంత మోనో యాక్ట్ ఉందని బిగ్ బాస్ చూస్తున్న వాళ్లకు అర్ధమైంది. బిగ్ బాస్ 7 లో మొదటి వారం నుంచే ఎవరికి వారు కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ 7 ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది.

మరి వారాంతరం హోస్ట్ నాగార్జున హౌస్ మెట్స్ పర్ఫార్మెన్స్ కి ఎలా స్పందిస్తారు. ఎవరిని మెచ్చుకుంటారు ఎవరిని టార్గెట్ చేస్తారు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. అంతేకాదు ఈ వీక్ నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.