Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పారితోషికం

కానీ ఈ సీజన్ లో అత్యధికం అంటే వారంకు రూ.3.75 లక్షలుగా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 4:16 AM GMT
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పారితోషికం
X

తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రతి సారి మాదిరిగానే ఈసారి కూడా కంటెస్టెంట్స్ విషయం లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా పెద్దగా గుర్తింపు ఉన్న కంటెస్టెంట్స్‌ లేక పోవడం పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. భారీ పారితోషికం ఇవ్వలేకే నిర్వాహకులు చిన్న సెలబ్రెటీలను ఎంపిక చేశారు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఇంతకు బిగ్ బాస్ సీజన్‌ 7 కంటెస్టెంట్స్ పారితోషికం విషయానికి వస్తే గతంలో ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్ కు వారంకు అయిదు లక్షలు ఆ పైన ఇవ్వడం జరిగింది. కానీ ఈ సీజన్ లో అత్యధికం అంటే వారంకు రూ.3.75 లక్షలుగా సమాచారం అందుతోంది. ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అత్యల్పంగా వారంకు లక్ష రూపాయల పారితోషికం ను తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు.

ఇక ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్‌ విషయానికి వస్తే షకీలా పేరు వినిపిస్తుంది. ఈమె వారంకు రూ.3.75 లక్షల పారితోషికం తీసుకుంటుందట. ఆమెకు ఉన్న సీనియారిటీ మరియు పాపులారిటీ నేపథ్యంలో ఆ రేంజ్ పారితోషికం సబబే అనేది చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం క్రేజ్ లేకున్నా కూడా ఒకప్పుడు ఆమె స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే.

సీనియర్‌ హీరో మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన శివాజీ కి వారానికి రూ.3.25 లక్షల పారితోషికం అందుతున్నట్లు గా తెలుస్తోంది. సీరియల్ నటుడు అమర్ దీప్ కి రూ.2.5 లక్షల పారితోషికం అందుతోంది. కొరియోగ్రాఫర్ అయిన ఆట సందీప్ కు వారానికి రూ.2.75 లక్షల పారితోషికం అందుతున్నట్లు గా సమాచారం.

సింగర్ దామినికి వారానికి రూ.2.25 లక్షల పారితోషికం అందుతుంది. గౌతమ్‌ కృష్ణ కి వారానికి రూ.1.5 లక్షలు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌ కి వారానికి రూ.1 లక్ష, ప్రియాంక జైన్‌ రూ.2.5 లక్షలు, రతికా రోజ్‌ కి రూ.1.5 లక్షలు, శోభా శెట్టి రూ.2 లక్షలు, శుభశ్రీ రూ.2 లక్షలు, టేస్టీ తేజ కి రూ. 1.75, ప్రిన్స్ యావర్‌ కి రూ.1 లక్ష, కిరణ్ రాథోడ్‌ రూ. 3 లక్షలు పారితోషికం ఇస్తున్నారు.