Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : కెప్టెన్ రేసులో వాళ్లిద్దరు.. ఎవరికి ఎక్కువ ఛాన్స్..?

అయితే ఈ టాస్క్ లో అర్జున్, సందీప్ ఇద్దరు ఫైనల్ కంటెండర్స్ గా నిలిచారు. వాళ్లిద్దరి మధ్యే ఈ కెప్టెన్సీ ఫైనల్ రౌండ్ జరుగుతుంది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 6:13 AM GMT
బిగ్ బాస్ 7 : కెప్టెన్ రేసులో వాళ్లిద్దరు.. ఎవరికి ఎక్కువ ఛాన్స్..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో మూడవ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు గులాబి పురం, జిలేబి పురం అంటూ రెండు గ్రూపులుగా హౌస్ మేట్స్ ని డివైడ్ చేసి వాళ్ల మధ్య కొన్ని టాస్కులు పెట్టాడు. అయితే ఈ టాస్కుల్లో జిలేబి పురం వాళ్లు గెలవగా వాళ్లలో ఒకరికి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ టాస్క్ లో అర్జున్, సందీప్ ఇద్దరు ఫైనల్ కంటెండర్స్ గా నిలిచారు. వాళ్లిద్దరి మధ్యే ఈ కెప్టెన్సీ ఫైనల్ రౌండ్ జరుగుతుంది.

వీరిద్దరిలో అర్జున్ కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యాడని తెలుస్తుంది. ఆల్రెడీ డిస్నీ హాట్ స్టార్ లైవ్ లో ఈ కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. అది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది. హౌస్ లో ఐదు వారాల తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. మొదటి వారం కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ కాగా.. రెండో వారం యావర్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు 3వ వారం కెప్టెన్ గా అర్జున్ అయ్యాడని తెలుస్తుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ హౌస్ మెట్స్ అందరికీ గట్టి పోటీ ఇస్తున్నాడు. కెప్టెన్ గా అర్జున్ హౌస్ లో తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మెట్స్ ఉండగా వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడతారన్నది తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ లో భాగంగా ఏడు వారాలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అవుతున్న బిగ్ బాస్ టీం రానున్న వారాల్లో కూడా ఇదే రేంజ్ లో అంతా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తారని తెలుస్తుంది. సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా పూర్తవగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ లో రతిక మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది.

మరి ఈసారి రతిక ఎలా హౌస్ లో తన ఆట తీరుని ప్రదర్శిస్తుంది అన్నది చూడాలి. సీజన్ 7 కి సంబంధించి ఇంకా కొన్ని 7 వారాలు మాత్రమే ఉంది. టైటిల్ రేసులో ఎవరు ఉంటారు. సీజన్ 7 కాబట్టి టాప్ 5 కి బదులుగా టాప్ 7 ఉంటుందా సీజన్ లో టైటిల్ గెలిచే దిశగా ఎవరెవరు పోటీ పడుతున్నారు అన్న విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.