Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : అందాల విందు అంతకు మించి

ఎప్పుడు కూడా బిగ్ బాస్ లో అందాల ఆరబోత చేసేందుకు ఒకరు ఇద్దరు ముద్దుగుమ్మలు ఉంటారు.

By:  Tupaki Desk   |   31 July 2023 7:12 AM GMT
బిగ్ బాస్ 7 : అందాల విందు అంతకు మించి
X

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్‌' సీజన్ 7 సెప్టెంబర్‌ మొదటి వారం లో ప్రారంభం కాబోతుందని స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అనౌన్స్మెంట్‌ ప్రోమో లో తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఆగస్టు మొదటి వారం లో కొత్త ప్రోమో రాబోతుంది. అందులో డేట్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 లో విభిన్నమైన కంటెస్టెంట్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు కూడా బిగ్ బాస్ లో అందాల ఆరబోత చేసేందుకు ఒకరు ఇద్దరు ముద్దుగుమ్మలు ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేసేందుకు గాను ముద్దుగుమ్మలు ఉండబోతున్నారట. ఇన్ స్టా గ్రామ్‌ బ్యూటీస్ మొదలుకు ని సీరియస్ ముద్దుగుమ్మల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ ఇమేజ్ కి తగ్గట్లుగా స్కిన్‌ షో చేస్తూ ప్రేక్షకుల కు పిచెక్కించబోతున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది హాట్ బ్యూటీస్ కు భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ అందాల విందు కు ఒప్పించారట. గతం లో కూడా ముద్దుగుమ్మలతో స్కిన్‌ షో చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా ముద్దుగుమ్మల ను సాధ్యమైనంతగా వాడేసుకోవాలని నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు.

కుడి ఎడమైతే.. అన్నట్లుగా ఈ సీజన్ ఉంటుందని ఇప్పటికే నాగార్జున ప్రకటించాడు. అంటే షో జరుగుతున్న సమయంలో మనం ఊహించిన దానికి రివర్స్ జరుగుతుంది. కంటెస్టెంట్స్ అనుకున్న దానికి కూడా రివర్స్ జరుగుతుంది. అలా ఈ సీజన్ ను చాలా స్పెషల్ గా ప్లాన్‌ చేస్తున్నారట.

ఈ సీజన్‌ లో బుల్లి తెర స్టార్‌ అంటూ పేరు దక్కించుకున్న ఈటీవీ ప్రభాకర్‌ సందడి చేయబోతున్నాడు. ఈయకు ఒకప్పుడు మంచి ఫాలోయింగ్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫాలోయింగ్ తగ్గిందని చెప్పాలి. బిగ్ బాస్ తో తన పూర్వ వైభవం ను దక్కించుకోవాలని ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఎంత మేరకు సఫలం అవుతాడు అనేది చూడాలి.