బిగ్ బాస్ సంజన డబల్ గేమ్ బట్టబయలు.. వీడియో చూపించి ఫైర్ అయి నాగ్..!
బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుస్తున్న సంజన ఆమె చేస్తున్న కొన్ని పనుల వల్ల మిగతా హౌస్ మెట్స్ చాలా బాధాడుతున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2025 9:46 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుస్తున్న సంజన ఆమె చేస్తున్న కొన్ని పనుల వల్ల మిగతా హౌస్ మెట్స్ చాలా బాధాడుతున్నారు. సంజన తాను చేస్తే కామెడీలా తీసుకోవాలని అంటుంది.. ఆమె సీరియస్ అయితే మాత్రం ఎవరి మాట వినదు అంటుంది. ఆతల వాళ్లు చెప్పేది ఏమాత్రం వినకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంది. లాస్ట్ వీక్ జరిగిన ఇష్యూస్ లో సంజనకి శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వీడియో చూపించి మరీ క్లాస్ ఇచ్చారు. దివ్య గురించి సంజన రోడ్ రోలర్ అనే కామెంట్స్ పై నాగార్జున అది బాడీ షేమింగ్ అవుతుంది.. చేతులు చూపించి మరీ అనడం తప్పని హెచ్చరించారు.
సుమన్ శెట్టి, గౌరవ్ మాట వినకుండా తొక్కలో కెప్టెన్ అంటూ..
ఇక మరో వీడియోలో లాస్ట్ వీక్ కెప్టెన్ గా ఉన్న సుమన్ శెట్టి, గౌరవ్ మాట వినకుండా తొక్కలో కెప్టెన్ అంటూ చెత్త కవర్ వాళ్ల మీద విసిరేసింది. ఆ వీడియో కూడా చూపించి నాగార్జున సంజన మీద ఫైర్ అయ్యారు. ఐతే నాగార్జున ముందు తను చేసిన తప్పులను కవర్ చేసుకునేందుకు సంజన నవ్వుతూ నేనే రోడ్ రోలర్ సార్ అంటూ నవ్వుతూ మాట్లాడింది. దానికి నాగార్జున ఇది సీరియస్ మ్యాటర్ అని ఫైర్ అయ్యారు.
వీడియోలో అంత క్లియర్ గా నువ్వే గొడవ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుందని అన్నది. హౌస్ లో కూడా సంజన ప్రతి విషయంలో తన డామినేషన్ కోరుతుంది. కానీ ఎక్కడైనా తేడా కొడితే ఇలా ఫైర్ అవుతుంది. వీడియో చూపించి మరీ నాగార్జున సంజనకి క్లాస్ ఇచ్చారు. హౌస్ మెట్స్ దగ్గర ఒకలా.. హోస్ట్ దగ్గర మరోలా సంజన ప్రవర్తన ఉందని కంటెస్టెంట్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా కనిపెట్టారు. హౌస్ లో మొదటి రెండు వారాలు చిరాకు తెప్పించినా చిన్నగా ఆట మీద పట్టు సాధిస్తుంది. హౌస్ లో బాగానే ఉంటుందని అనుకునేలోగా సంజన ఈమధ్య కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్టు ఉంది. అందుకే ఫైర్ అవుతూ ఇలా హోస్ట్ కి దొరికిపోయింది.
ఇమ్మాన్యుయెల్ సంజన మమ్మీ బాండింగ్..
అంతేకాదు సంజన కి ఈ వీక్ స్పెషల్ పనిష్ మెంట్ ఒకటి ఉంటుందని టాక్. ఈ వారం హౌస్ కి కెప్టెన్ గా ఇమ్మాన్యుయెల్ ఉంటున్నాడు. ఇమ్మాన్యుయెల్ సంజనని మమ్మీ అంటూ బాండింగ్ ఏర్పరచుకున్నాడు. మరి ఈ మమ్మీ ఈ వీక్ తప్పులు చేస్తే చూస్తూ ఊరుకుంటాడా లేదా నాగార్జున సార్ ఎలాగు నిలదీస్తారు కాబట్టి ఫైర్ అవుతాడా అన్నది చూడాలి. సంజన డబల్ గేమ్ ని గుర్తించిన కంటెస్టెంట్స్ ఆమెను ఇలానే హోస్ట్ దగ్గర పట్టించాలని భావిస్తున్నారు. సంజన తన బిహేవియర్ లో మార్పు చేసుకుని తన ఫోకస్ ఆట మీద పెడితేనే టాప్ వీక్స్ దాకా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ వారం రమ్య మోక్షతో డేంజర్ జోన్ లో అంటే చివరి దాకా ఉండేది సంజనానే అని తెలుస్తుంది.
