వర్షిణి దెబ్బకి మైండ్ బ్లాక్ అయిన బిగ్ బాస్ హౌజ్
బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగో వారం ఆట ఆసక్తికరంగా ఊహించని మలుపులతో సాగింది. హౌజ్ లో చాలా ట్విస్ట్స్ జరుగగా, ఈ సారి నాగార్జున ఏమంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By: Tupaki Desk | 3 Oct 2026 9:38 AM ISTబిగ్‌బాస్ హౌస్‌లో నాలుగో వారం ఆట ఆసక్తికరంగా ఊహించని మలుపులతో సాగింది. హౌజ్ లో చాలా ట్విస్ట్స్ జరుగగా, ఈ సారి నాగార్జున ఏమంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ రేసు, ఇమ్యూనిటీల కోసం జరిగిన పోటీలు హౌస్‌లో పెద్ద రచ్చకే దారి తీశాయి.
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగిన మూడు పోటీలలో రెండు గెలుచుకున్న 'టీమ్ భైరవ' సభ్యులు మాత్రమే కెప్టెన్సీ రేసులో ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించారు. అయితే ఆ ఎనిమిది మందిలో కేవలం ఐదుగురిని మీరే ఎన్నుకోవాలని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో తమకు కెప్టెన్సీ కావాలా లేక ఇమ్యూనిటీ కావాలా అనే దానిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరికి వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ, అమన్ కంటెండర్ల జాబితాలో నిలిచారు.
అయితే ఈ చర్చల సమయంలో ఎనిమిది మంది కలిసి గ్రూప్‌గా ఏర్పడి రోహిత్‌ను కావాలనే కెప్టెన్సీ రేసు నుంచి పక్కన పెట్టారు. అందరూ కలిసి రోహిత్ కి చెక్ పెడితే అది కచ్చితంగా అతన్ని డీ మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది అని భావించారు. ఇది పక్కన పెడితే వర్షిణి ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కి అమన్ కి మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు.
ఈ వారం కూడా తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా స్ట్రాంగ్‌గా లేనని భావించిన వర్షిణి, రోహిత్ చేసిన కామెంట్లు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తనకు లభించిన మజిక్ పవర్‌ను ఉపయోగించి, కెప్టెన్సీని స్వాప్ చేసుకుని ఇమ్యూనిటీని దక్కించుకునే వ్యూహాన్ని ఎంచుకుంది.
అయితే ఈ పరిణామం అమన్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. టాస్క్ గెలిచి కెప్టెన్ అయిన అమన్.. వర్షిణి తీసుకున్న నిర్ణయం వల్ల అకస్మాత్తుగా కెప్టెన్సీని, ఇమ్యూనిటీని కోల్పోవాల్సి వచ్చింది. వర్షిణి వచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, అమన్‌కు మాత్రం ఇది పెద్ద అన్యాయంగా మారింది. అయితే ఈ సానుభూతి అమన్‌కు ఓటింగ్ పరంగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.
అయితే ఇమ్యూనిటీ టాస్క్లో సృష్టి.. వంశీని ట్రిగ్గర్ చేయడంతో అతని ఇమ్యూనిటీ కోల్పోయి టెన్షన్‌లోకి వెళ్లాడు. అయితే వెంటనే సుధీర్ రంగంలోకి దిగి సృష్టిని ఎలిమినేట్ చేసి, వంశీ స్థానాన్ని భర్తీ చేశాడు. చివరికి అందరి నిర్ణయాల ఫలితంగా సుధీర్, వంశీ ఇద్దరూ ఇమ్యూనిటీని సాధించి ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇకపోతే ఈ వారం రోహిత్ కి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సెలెబ్రిటీలు అందరూ జట్టుగా ఏర్పడి అగ్నిపరీక్ష గ్రూప్ ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ముందు ముందు కూడా వాళ్ళు ఇదే దూకుడు కొనసాగిస్తే, ఏం జరగబోతుందో వేచి చూడాలి.
