బిగ్ బాస్ 9.. నాగార్జున ప్లాన్ చేంజ్..!
షో చూసి హోస్టింగ్ చేస్తే మాత్రం నాగార్జున ఇంకాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేయగలరు. సీజన్ 9 కి నాగార్జున హోస్టింగ్ తో కూడా అదరగొడతాడని తెలుస్తుంది.
By: Tupaki Desk | 23 July 2025 3:00 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందన్న న్యూస్ తెలిసిందే. స్టార్ మా అందుకు తగినట్టుగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు ప్రోమోస్ రెడీ చేస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సీజన్ 9 కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 9 మంది సెలబ్రిటీస్ తో పాటు మరో 9 మంది కామన్ మ్యాన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 రణరంగంగా ఉండబోతుందని నాగార్జున ఇప్పటికే ప్రోమోతో హింట్ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున కూడా ఈసారి ఇంకాస్త పకడ్బందీ ప్లానింగ్ తో వస్తున్నారట. అంతకుముందు సీజన్ లో నాగార్జున హోస్ట్ మీద కాస్త నెగిటివిటీ వచ్చింది. కేవలం శని, ఆదివారాలు మాత్రమే షో నిర్వాహకులతో డిస్కషన్.. ఇంకా పి.సి.ఆర్ నుంచి బిగ్ బాస్ టీం ఇచ్చే ఇన్ పుట్స్ తోనే ఆయన కంటెస్టెంట్స్ తో మాట్లాడుతుంటారు. షో చూడకుండా హోస్ట్ చేస్తున్నాడని నాగార్జున మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. అందుకే ఈసారి నాగార్జున కొంత భాగం షోని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట.
షో చూసి హోస్టింగ్ చేస్తే మాత్రం నాగార్జున ఇంకాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేయగలరు. సీజన్ 9 కి నాగార్జున హోస్టింగ్ తో కూడా అదరగొడతాడని తెలుస్తుంది. సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఐతే హౌస్ లో ఉన్నంతవరకు ఎవరు కూడా నాగార్జున హోస్టింగ్ గురించి మాట్లాడరు. కానీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక మాత్రం నాగార్జునని కూడా కొందరు కంటెస్టెంట్స్ తప్పుపట్టడం మొదలు పెట్టారు.
ఎక్కడ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్స్ హోస్ట్ ని రాంగ్ అని చెప్పట్లేదు. తెలుగు బిగ్ బాస్ లోనే అది ఎక్కువ అవుతుంది. అందుకే ఈసారి అలాంటి వారికి కూడా నాగార్జున ఛాన్స్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. వీక్ మొత్తం జరిగిన మొత్తాన్ని తాను షార్ట్ కట్ లో చూసేసి షో హోస్ట్ చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి ఇది మంచి పరిణామమనే చెప్పొచ్చు. సెప్టెంబర్ లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9 డిసెంబర్ వరకు జరిగే అవకాశం ఉంది.
